అన్ని కాలంబుల-నున్న యెహోవా ని-నెన్నదరంబయో

అన్ని కాలంబుల-నున్న యెహోవా ని-నెన్నదరంబయో -
కన్న తండ్రి - వన్నె కెక్కిన మోక్ష - వాసాళి సన్నుతు -
లున్నతమై యుండ - మున్నె నీకు.                                    II అన్ని II


1. నిన్ను బ్రకటన సేయ - నిఖిల లోకములను -
బన్నుగ జేసిన - బలుడ వీవె - ఉన్న లోకంబుల -
నుడుగక కరుణాసం - పన్నతతో నేలు ప్రభుడ నీవే -
అన్ని జీవుల నెరిగి - యాహార మిచ్చుచు -  నున్న
సర్వజ్ఞుండవు నీవే - ఎన్న శక్యముగాక -
ఉన్న లక్షణముల - సన్నుతించుటకు నే- జాలుదునా.            II అన్ని II


2. పుట్టింప నీవంచు - బోషింప నీవంచు -

గిట్టింప నీవంచు - గీర్తింతును - వట్టి పనికి మాలి - నట్టి 

మానవులచే- పట్టి రక్షింప - ధ్యుండవంచు -

దట్టమైన కృపను - దరిజేర్చ - నాకిచ్చి - పట్టయి నిలచియుందు -

ప్రభుడ వంచు - గట్టడచే గడ ముట్టుదనుక 

నా - పట్టుకొలది నిన్ను - బ్రస్తుతింతు.     II అన్ని II


3. కారుణ్యనిధి నీవు కఠినాత్ముడను నేను- భూరి శుద్ధుడ నీవు-

పాపి నేను  - సార భాగ్యుడ నీవు జగతిలో నాకన్న -

దారిద్రుడే లేడు - తరచి చూడ  - 

 సార సద్గుణముల - సంపన్నుడవు నీవు -

ఘోర దుర్గుణ సం-చారి నేను ఏ రీతి స్తుతియింతు -

నే రీతి సేవింతు - నేర మెన్నక ప్రోవ - నెరనమ్మితి     II అన్ని II Anni kaalambula-nunna yehovaa ni-nennadarambayo - Kanna tandri - vanne kekkina moksha - vaasaali sannutu - Lunnatamai yunda - munne neeku. II anni II 1. ninnu brakatana seya - nikhila lokamulanu - Bannuga jesina - baluda veeve - unna lokambula - Nudugaka karunaasam - pannatato nelu prabhuda neeve - Anni jeevula nerigi - yaahaara michchuchu - nunna sarvajnyundavu neeve - enna shakyamugaaka - Unna lakshanamula - sannutinchutaku ne- jaaludunaa. II anni II 2. puttimpa neevanchu - boshimpa neevanchu - Gittimpa neevanchu - geertintunu - vatti paniki maali - natti Maanavulache- patti rakshimpa - dhyundavanchu - Dattamaina krupanu - darijercha - naakichchi - pattayi nilachiyundu - Prabhuda vanchu - gattadache gada muttudanuka Naa - pattukoladi ninnu - brastutintu. II anni II 3. kaarunyanidhi neevu kathinaatmudanu nenu- bhoori shuddhuda neevu- Paapi nenu - saara bhaagyuda neevu jagatilo naakanna - Daaridrude ledu - tarachi chooda - saara sadgunamula - sampannudavu neevu - Ghora durguna san-chaari nenu e reeti stutiyintu - Ne reeti sevintu - nera mennaka prova - neranammiti II anni II


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు