అలలపైనే నడిచిన - నాడు యేసయ్యా
గలిబిలిని నా కలవరములను - తొలగజేసిన కలుష హరుడా
అదుకోవయ్యా - నాదు యేసయ్యా
1 శుద్దుడా నీ పిలుపు వింటిని - అద్దరికి నే పయనమైతిని (2)
ప్రొద్దు పోయెను భయములాయెను - ఉద్దరించగ స్వామిరావా ॥ఆదుకోవయ్యా॥
2. నట్టనడి సం-ద్రాన రేగెను - అట్టహాసపు పెనుతుఫాను (2)
గట్టు చూడగా చాల దూరము - ఇట్టి శ్రమలలో చిక్కుకొంటిని ॥ఆదుకోవయ్యా॥
3. అలలు నాపై విసరికొట్టగ - నావ నిండుగ నీరుజేరెను (2)
బ్రతుకులెంతో భారమాయెను- రేవు చేరే దారిలేదే ॥ఆదుకోవయ్యా॥
4. మాటమాత్రపు సెలవుచేత నీటుగా అద్భుతములెన్నో (2)
చాలా చేసిన శక్తిమంతుడా - జాలిచూపి రేవు చేర్చవా ॥ఆదుకోవయ్యా॥
5. చిన్న జీవిత నావ నాది - నిన్నే గురిగా పయనమైతిని (2)
ఎన్నో శోధన లెన్నో భయములు - కన్న తండ్రి కావరావా ॥ఆదుకోవయ్యాII
No comments:
Post a Comment