అందాలతార అరుదెంచె నాకై - అంబర వీధిలో

అందాలతార అరుదెంచె నాకై  -  అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -  అవని చాటుచున్ 

ఆనంద సంద్రముప్పొంగె నాలో -  అమరకాంతితో 

ఆది దేవుని చూడ ఆశింప మనస్సు పయనమైతిని


1. విశ్వాసయాత్ర దూరమెంతైన  -  విందుగ దోచెను 

వింతైన శాంతి వర్షించే నాలో - విజయపథమున 

విశ్వాల నేలెడి దేవకుమారుని - వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్


2. యెరూషలేము రాజనగరిలో -  యేసును వెదకుచు 

ఎరిగిన దారి తొలగినవేళ - ఎదలో కృంగితి
యేసయ్య తార ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో 

ఎంతో అబ్బురపడుచు విస్మయమొందుచు యేగితి స్వామి కడకు


3. ప్రభు జన్మస్థలము పాకయెగాని - పరలోక సౌధమే 

బాలుని చూడ జీవితమంతా -  పావనమాయెను

ప్రభు పాద పూజ దీవెనకాగా -  ప్రసరించే పుణ్యము

బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన Andaalataara arudenche naakai - ambara veedhilo avataaramoorti yesayya keerti - avani chaatuchun Aananda sandramupponge naalo - amarakaantito Aadi devuni chooda aashimpa manassu payanamaitini 1. vishvaasayaatra dooramentaina - vinduga dochenu Vintaina shaanti varshinche naalo - vijayapathamuna Vishvaala neledi devakumaaruni - veekshinchu deekshato Virajimme balamu pravahinche prema vishraanti nosaguchun 2. yerooshalemu raajanagarilo - yesunu vedakuchu Erigina daari tolaginavela - edalo krungiti Yesayya taara eppativole - eduraaye trovalo Ento abburapaduchu vismayamonduchu yegiti svaami kadaku 3. prabhu janmasthalamu paakayegaani - paraloka saudhame Baaluni chooda jeevitamantaa - paavanamaayenu Prabhu paada pooja deevenakaagaa - prasarinche punyamu Bratuke mandiramaaye arpanale sirulaaye phaliyinche praarthana 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు