అమూల్య రక్తము ద్వారా

అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా 

సర్వశక్తుని ప్రజలారా - పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము


1. మన యౌవ్వన జీవితముల్ - శరీరాశకు లోబరచి
    చెడుమాటలను పలుకుచు-శాంతిలేక యుంటిమిగా ll అమూల్య ll


2. చెడు మార్గమున పోతిమి  - దాని యంతము మరణము 

   నరక శిక్షకు లోబడుచు - పాపపు ఫలితము పొందితిమి. llఅమూల్య ll


3. నిత్య సత్య దేవుని నామమున మొరలిడక
    స్వంత నీతి తోడనే - దేవుని రాజ్యము కోరితిమి ॥అమూల్య॥


4. కనికరముగల దేవుడు మానవ రూపము దాల్చెను

    ప్రాణము సిలువలో బలిజేసి - మనలను విమోచించెను   ॥అమూల్య॥


5. తన రక్తధారలలో మన పాపములను కడిగి 

   మన కన్నులను తెరచి మనలను నింపెను జ్ఞానముతో llఅమూల్య॥


6. పాపులమైన మనమీద తన యాశ్చర్య ఘన ప్రేమ 

   కుమ్మరించెను మన ప్రభువు కృతజ్ఞత చెల్లించెదము ॥అమూల్య॥


7. మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా 

    మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములన్ llఅమూల్యll Amoolya raktamu dvaaraa - rakshana pondina janulaaraa Sarvashaktuni prajalaaraa - parishuddhulaaraa paadedamu Ghanata mahima stutulanu parishuddhulaaraa paadedamu 1. mana yauvvana jeevitamul - shareeraashaku lobarachi chedumaatalanu palukuchu-shaantileka yuntimigaa ll amoolya ll 2. chedu maargamuna potimi - daani yantamu maranamu naraka shikshaku lobaduchu - paapapu phalitamu ponditimi. ll amoolya ll 3. nitya satya devuni naamamuna moralidaka svanta neeti todane - devuni raajyamu koritimi ॥amoolya॥ 4. kanikaramugala devudu maanava roopamu daalchenu praanamu siluvalo balijesi - manalanu vimochinchenu ॥amoolya॥ 5. tana raktadhaaralalo mana paapamulanu kadigi mana kannulanu terachi manalanu nimpenu jnyaanamuto IIamoolya॥ 6. paapulamaina manameeda tana yaashcharya ghana prema kummarinchenu mana prabhuvu krutajnyata chellinchedamu ॥amoolya॥ 7. mana rakshakuni stutinchedamu - manalanu jesenu dhanyulugaa mana devuni karpinchedamu - jeevaatma shareeramulan llamoolyall



Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు