హోసన్ననుచూ స్తుతి పాడుచూ

హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)
హోసన్నా… హోసన్నా… (4)                 ||హోసన్ననుచూ||

1.ఈ లోకయాత్రలో బాటసారులం - ఈ జీవన కడలిలో పరదేశులం (2)
క్షణభంగురం ఈ క్షయ జీవితం - అక్షయ నగరం మనకు శాశ్వతం (2)       ||హోసన్నా||

2.మన్నయిన ఈ దేహం మహిమరూపమై - ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)
నాధుడేసుకు నవ వధువులము - నీతి పాలనలోన యువరాణులము (2)     ||హోసన్నా||

3.ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును - చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)
ఆకలి లేదు దప్పిక లేదు - ఆహా మన యేసుతో నిత్యమానందం (2)   ||హోసన్నా||


Hosannanuchoo stuti paaduchoo seeyonuku cheredam (2)

Hosannaa… hosannaa… (4)                 ||hosannanuchoo||

1.Ee lokayaatralo baatasaarulam

Ee jeevana kadalilo paradeshulam (2)

Kshanabhanguram ee kshaya jeevitam

Akshaya nagaram manaku shaashvatam (2)     ||hosannaa||

2.Mannayina ee deham mahimaroopamai

Dhavalavarna vastramulu dhariyinchedamu (2)

Naadhudesuku nava vadhuvulamu

Neeti paalanalona yuvaraanulamu (2)      ||hosannaa||

3.Prati bhaashpa binduvunu tudichiveyunu

Chintalanni teerchi chenta niluchunu (2)

Aakali ledu dappika ledu

Aahaa mana yesuto nityamaanandam (2)   ||hosannaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు