సర్వకృపానిధియగు ప్రభువా

సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా (2)

స్తోత్రము చేసి స్తుతించెదను - సంతసముగ నిను పొగడెదను (2)


హల్లెలూయా హల్లెలూయా… హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యని పాడెదను ఆనందముతో సాగెదను
నేను… ఆనందముతో సాగెదను

1. ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి (2)
పరిశుద్ధముగా జీవించుటకై - పాపిని నను కరుణించితివి (2) ||హల్లెలూయా||

2.అల్పకాల శ్రమలనుభవింప - అనుదినము కృపనిచ్చితివి (2)
నాథుని అడుగుజాడలలో - నడుచుటకు నను పిలిచితివి (2)    ||హల్లెలూయా||

3.మరణ శరీరము మర్పునొంది - మహిమ శరీరము పొందుటకై (2)
మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములను తీర్చితివి (2)||హల్లెలూయా||

4.భువినుండి శ్రేష్ట ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా (2)
భూజనములలోనుండి నన్ను - ప్రేమించి క్రయ ధనమిచ్చితివి (2)     ||హల్లెలూయా||

5.ఎవరూ పాడని గీతములు - యేసుతో నేను పాడుటకై  (2)
హేతువు లేకయే ప్రేమించెన్‌ - యేసుకు నేనేమివ్వగలన్‌ (2)          ||హల్లెలూయా|| Sarvakrupaanidhiyagu prabhuvaa - sakala charaachara santoshamaa (2) Stotramu chesi stutinchedanu - santasamuga ninu pogadedanu (2) Hallelooyaa hallelooyaa… hallelooyaa hallelooyaa Hallelooyaa yani paadedanu aanandamuto saagedanu Nenu… aanandamuto saagedanu 1. preminchi nannu vedakitivi - preetito nanu rakshinchitivi (2) Parishuddhamugaa jeevinchutakai - paapini nanu karuninchitivi (2) ||hallelooyaa|| 2.alpakaala shramalanubhavimpa - anudinamu krupanichchitivi (2) Naathuni adugujaadalalo - naduchutaku nanu pilichitivi (2) ||hallelooyaa|| 3.marana shareeramu marpunondi - mahima shareeramu pondutakai (2) Mahimaatmato nanu nimpitivi - marana bhayamulanu teerchitivi (2)||hallelooyaa|| 4.bhuvinundi shreshta phalamuganu - devuniki nitya svaasthyamugaa (2) Bhoojanamulalonundi nannu - preminchi kraya dhanamichchitivi (2) ||hallelooyaa|| 5.evaroo paadani geetamulu - yesuto nenu paadutakai (2) Hetuvu lekaye preminchen‌ - yesuku nenemivvagalan‌ (2) ||hallelooyaa||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు