సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను

సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను

నిర్వహించును దాస భారము - నిత్యమెద రాజిల్లను (2) ||సర్వ||


1.ముదముతో నిర్మానకుండగు - మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని - వందనముతో వేడరే (2)    ||సర్వ||

2.వేదపారాయణము సేయుచు - విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ - స్వాoతమున బూజింపరే (2) ||సర్వ||

3.ఎదను విశ్రాంతిన్ పరేశుని - హెచ్చుఁగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ - సర్వ మాయన కీయరే (2)      ||సర్వ||

4.చావు పుట్టుక లేనివాడుగ - సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ - హేష్టులను రక్షించును (2) ||సర్వ||

5.దాసులై దేవునికి నెదలో - దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము - నే మరక మైదాల్పరే (2)   ||సర్వ||

Sarvashaktuni stotragaanamu - Salpare jagamellanu Nirvahinchunu daasa bhaaramu - Nityameda raajillanu (2) ||sarva|| 1.Mudamuto nirmaanakundagu - Moola kartanu baadare Vadana meekshmaanvaochi devuni - Vandanamuto vedare (2)||sarva|| 2.Vedapaaraayanamu seyuchu - Vishvamanta jayimpare Saadaramugaa devu nika mee - Svaaotamuna boojimpare (2) ||sarva|| 3.Edanu vishraantin pareshuni - Hechchumgaa nuti jeyare Sadamalambagu bhaktito mee - Sarva maayana keeyare (2) ||sarva|| 4.Chaavu puttuka lenivaaduga - Santatamu jeevinchunu Eevulichchuchu dannu vedu ma - Heshtulanu rakshinchunu (2) ||sarva|| 5.Daasulai devuniki nedalo - Darpamunu bogaalpare Yesukreestuni punya vastramu - Ne maraka maidaalpare (2) ||sarva||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు