స్వఛ్చంద సీయోను వాసి

స్వఛ్చంద సీయోను వాసి - సర్వాధికారి – కస్తూరి పూరాసి

వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2)

అల్ఫా ఒమేగ తానే (2) ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద||


1.ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముగ జేతున్ – నీ ప్రజలందరి
యెదుట - పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే
లెక్క లేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద||

2.సంగీతం నాదముల తోడ - సీయోను పురము – సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ దుఃఖము
నిట్టూర్పును పోయెన్ - మిక్కిలి ఆనందము కల్గెన్ (2)    ||స్వఛ్చంద||

3.నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో – మాణిక్య
మణులతో సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో ప్రశస్త
రత్నములతో - ప్రవిమలముగా నిను గట్టెదను (2)   ||స్వఛ్చంద||

4.సుమముల హారము సంతోషానంద తైలము నీదే
స్తుతి వస్త్రమును నీదే  ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే
హిత వత్సరము విముక్తి   ఆత్మాభిషేకము నీదే (2)  ||స్వఛ్చంద||

5.జలములలో బడి దాటునప్పుడు - బలమై యుండెదను 
నీ తోడై యుండెదను - నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు
అగ్ని మధ్యను నడచినను - జ్వాలలు నిను కాల్చగ లేవు (2)  ||స్వఛ్చంద||

6.ఇత్తడి తలుపుల బగుల గొట్టెద - నినుప ఘడియలను
విడగొట్టెదను నేను - అంధకార స్థలములలో - నున్నట్టి నిధులను
రహస్యములో మరుగైన  ధనమును నీ కొసంగెదను (2)       ||స్వఛ్చంద||

7.గర్భమున పుట్టినది మొదలు - తల్లి యొడిలోన – కూర్చుండినది
మొదలు - నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా ముదిమి
వచ్చుఁ వరకు నిన్ను - ఎత్తుకొను వాడను నేనే (2)         ||స్వఛ్చంద|| Svachhchanda seeyonu vaasi - sarvaadhikaari – kastoori pooraasi Vartamaana bhoota bhavi-shyatkaala vaasi (2) Alphaa omega taane (2) aadyantamu mana yese (2) ||svachhchanda|| 1.idigo nenoka nibandhananu - adbhutamuga jetun – nee prajalandari Yeduta - parishodhimpajaalani mahaa – panulella prabhuve Lekka leni yadbhutamul - makkuvato cheyuvaadu (2) ||svachhchanda|| 2.sangeetam naadamula toda - seeyonu puramu – sompuganu cheritimi Shaashvata santoshamu maa – shiramulapai velasen duhkhamu Nittoorpunu poyen - mikkili aanandamu kalgen (2) ||svachhchanda|| 3.neelamula punaadulu vesi - neelaanjanamulato – maanikya Manulato suvarna shuneeyamula – soorya kaantamuto prashasta Ratnamulato - pravimalamugaa ninu gattedanu (2) ||svachhchanda|| 4.sumamula haaramu santoshaananda tailamu neede Stuti vastramunu neede ullaasa vastrambu neede – vidudalayi neede Hita vatsaramu vimukti aatmaabhishekamu neede (2) ||svachhchanda|| 5.jalamulalo badi daatunappudu - balamai yundedanu Nee todai yundedanu - nadulalo vellunappudu – neepai paaravu Agni madhyanu nadachinanu - jvaalalu ninu kaalchaga levu (2) ||svachhchanda|| 6.ittadi talupula bagula gotteda - ninupa ghadiyalanu Vidagottedanu nenu - andhakaara sthalamulalo - nunnatti nidhulanu Rahasyamulo marugaina dhanamunu nee kosangedanu (2) ||svachhchanda|| 7.garbhamuna puttinadi modalu - talli yodilona – koorchundinadi Modalu - nenu chanka bettukonna – naadu prajalaaraa mudimi Vachchum varaku ninnu - ettukonu vaadanu nene (2) ||svachhchanda||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు