సిలువ చెంత చేరిననాడు
సిలువ చెంత చేరిననాడు - కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను - సిద్ధపడిన భక్తులజూచి
1.కొండలాంటి బండలాంటి - మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన - పిలచుచుండే పరము చేర ||సిలువ||
2.వంద గొర్రెల మందలోనుండి - ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి - ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ||
3.తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ||
4.పాపి రావా పాపము విడచి - పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము ||సిలువ||
Siluva chenta cherinanaadu - kalushamulanu kadigiveyun
Pauluvalenu seelavalenu - siddhapadina bhaktulajoochi
1.kondalaanti bandalaanti - mondi hrudayambu mandinchu
Pandiyunna paapulanaina - pilachuchunde paramu chera ||siluva||
2.vanda gorrela mandalonundi - okati tappi ontariyaaye
Tombadi tommidi gorrela vidichi - ontariyaina gorrenu vedaken ||siluva||
3.tappipoyina kumaarundu - tandrini vidachi taralipoye
Tappu telisi tirigiraagaa - tandriyatani jerchukoniye ||siluva||
4.paapi raavaa paapamu vidachi - parishuddhula vindula jera
Paapula gatini parikinchitivaa - paataalambe vaari yantamu ||siluva||
Comments
Post a Comment