ఎంతో వింత యెంతో చింత

ఎంతో వింత యెంతో చింత-యేసునాధు మరణ మంత-పంతము తో
జేసి రంత-సొంత ప్రజలు స్వామి నంత         ||ఎంతో||

1.పట్టి కట్టి నెట్టి కొట్టి - తిట్టి రేసు నాధు నకటా - అట్టి శ్రమల నొంది
పలుక - డాయె యేసు స్వామి నాడు (2)       ||ఎంతో||

2.మొయ్యలేని మ్రాను నొకటి - మోపి రేసు వీపు పైని - మొయ్యలేక -
మ్రాని తోడ - మూర్చబోయే నేసు తండ్రి (2)      ||ఎంతో||

3.కొయ్యపై నేసయ్యన్ బెట్టి - కాలు సేతులలో జీలల్ - కఠిను లంత
గూడి కొట్టిరి - ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)      ||ఎంతో||

4.దాహము గొన చేదు చిరక - ద్రావ నిడిరి ద్రోహు లకటా = ధాత్రి
ప్రజల బాధ కోర్చి - ధన్యుడా దివి కేగె నహహా (2) ||ఎంతో||

5.బల్లెముతో బ్రక్కన్ బొడవన్ - పారే నీరు రక్త మహహా - ఏరై పారే
యేసు రక్త - మెల్ల ప్రజల కెలమి నొసగు (2)      ||ఎంతో|| Ento vinta yento chinta-yesunaadhu marana manta-pantamu to Jesi ranta-sonta prajalu svaami nanta ||ento|| 1.patti katti netti kotti - titti resu naadhu nakataa - atti shramala nondi paluka - daaye yesu svaami naadu (2) ||ento|| 2.moyyaleni mraanu nokati - mopi resu veepu paini - moyyaleka - mraani toda - moorchaboye nesu tandri (2) ||ento|| 3.koyyapai nesayyan betti - kaalu setulalo jeelal - kathinu lanta goodi kottiri - ghoramuga kreestesun batti (2) ||ento|| 4.daahamu gona chedu chiraka - draava nidiri drohu lakataa = dhaatri prajala baadha korchi - dhanyudaa divi kege nahahaa (2) ||ento|| 5.ballemuto brakkan bodavan - paare neeru rakta mahahaa - erai paare yesu rakta - mella prajala kelami nosagu (2) ||ento||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు