భాసిల్లెను సిలువలో పాపక్షమా
భాసిల్లెను సిలువలో పాపక్షమా - యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను||
1. కలువరిలో నా పాపము పొంచి - సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||
2.దోషము చేసినది నేనెకదా - మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను||
3.పాపము చేసి గడించితి మరణం -శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను||
4.నీ మరణపు వేదన వృధా గాదు -నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||
5.ఎందులకో నాపై ఈ ప్రేమ - అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||
6.నమ్మిన వారిని కాదన వనియు - నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||
Bhaasillenu siluvalo paapakshamaa - yesu prabhoo nee divya kshamaa ||bhaasillenu|| 1.kaluvarilo naa paapamu ponchi siluvaku ninnu yaahuti chesi Kalushaharaa karuninchitivi (2) ||bhaasillenu|| 2.doshamu chesinadi nenekadaa - mosamuto bratikina nene kadaa Mositivaa naa shaapabhaaram (2) ||bhaasillenu|| 3.paapamu chesi gadinchiti maranam - shaapamegaa nenaarjinchinadi Kaaparivai nanu brochitivi (2) ||bhaasillenu|| 4.nee maranapu vedana vrudhaa gaadu - naa madi nee vedanalo munigenu Kshemamu kaligenu hrudayamulo (2) ||bhaasillenu|| 5.endulako naapai ee prema - andadayyaa svaamee naa madiki Andulake bhayamonditini (2) ||bhaasillenu|| 6.nammina vaarini kaadana vaniyu - nemmadi nosagedi naa prabhudavani Nammiti nee paadambulanu (2) ||bhaasillenu||
Comments
Post a Comment