హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా     ||హే ప్రభు||

1.శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవన దీపా (2)
శాంతి సువార్తనిధీ            ||సిల్వధరా||

2.తపములు తరచిన నిన్నెగదా - జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా            ||సిల్వధరా||

3.మతములు వెదకిన నిన్నెకదా - వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా         ||సిల్వధరా||

4.పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా            ||సిల్వధరా||

5.కాననతుల్య సమాజములో - హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా          ||సిల్వ ధరా||

6.దేవుని బాసిన లోకములో - చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా      ||సిల్వ ధరా||

7.పాపము చేసిన స్త్రీని గని - పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా             ||సిల్వ ధరా||

8.ఖాళీ సమాధిలో మరణమును - ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా     ||సిల్వ ధరా||

9.కలువరిలో నీ శాంతి సుధా - సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా      ||సిల్వ ధరా||


He prabhuyesu he prabhuyesu he prabhu devasutaa Silvadharaa – paapaharaa – shaantikaraa ||he prabhu|| 1.shaanti samaadhaanaadhipatee Svaantamulo prashaantanidhee (2) Shaanti svaroopaa jeevanadeepaa (2) Shaanti suvaartanidhee ||silvadharaa|| 2.tapamulu tarachina ninnegadaa Japamulu golichina ninnegadaa (2) Viphalulu chesina vijnyaapanalaku (2) Saphalata neevegadaa ||silvadharaa|| 3.matamulu vedakina ninnekadaa Vratamulugorina ninnegadaa (2) Patitulu devuni sutulani nerpina (2) Hitamati veevegadaa ||silvadharaa|| 4.palukulalo nee shaantikadha Tolakari vaanagaa kurisegadaa (2) Malamala maadina maanava hrudayamu (2) Kalakalalaade kadaa ||silvadharaa|| 5.kaananatulya samaajamulo Heenata jendenu maanavata (2) Maanava maitrini silva pataakamu (2) Daanamu jesegadaa ||silva dharaa|| 6.devuni baasina lokamulo Chaavuye kaapuramunde gadaa (2) Devunito sakhyambunu jagatiki (2) Yeevi niditivi gadaa ||silva dharaa|| 7.paapamu chesina streeni gani Paapula kopamu mande gadaa (2) Daapuna jeri paapini brochina (2) Kaapari veevegadaa ||silva dharaa|| 8.khaalee samaadhilo maranamunu Khaidiga jesina neeve gadaa (2) Khalamayudagu saataanuni garvamu (2) Khandanamaaye gadaa ||silva dharaa|| 9.kaluvarilo nee shaanti sudhaa Selayeruga bravahinche gadaa (2) Kalusha edaarilo kaluvalu pooyuta (2) Siluva vijayamu gadaa ||silva dharaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు