అపరాధిని యేసయ్య - కృపజూపి బ్రోవుమయ్యా
1. సిలువకు నిను నే గొట్టితిని - తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా llఅపll
2. ప్రక్కలో బల్లెపుపోటు - గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని - మక్కువ జూపితివయ్యో llఅపll
3. ముళ్ళతో కిరీటంబు - నల్లి నీ శిరమున నిడితి
నావల్ల నేరమాయె - చల్లని దయగల తండ్రి llఅపll
4. దాహంబు గొనగా చేదు చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితిని - దేహంబు గాయంబులను llఅపll
5. ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా llఅపll
6. చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బలచేత
నిందలు పెట్టితినయ్యో - సందేహమేలనయ్యా llఅపll
7. శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా
అక్షయభాగ్యమునియ్య - మోక్షంబు జూపితివయ్యా llఅపll Aparaadhini yesayya - krupajoopi brovumayyaa Nepamenchakaye nee krupalo - naparaadhamulanu kshaminchu 1. siluvaku ninu ne gottitini - tuluvalato jeritini Kalushambulanu mopitini doshunda nenu prabhuvaa llapall 2. prakkalo ballepupotu - grakkuna podichiti nene Mikkili baadhinchitini - makkuva joopitivayyo llapall 3. mullato kireetambu - nalli nee shiramuna niditi Naavalla neramaaye - challani dayagala tandri llapall 4. daahambu gonagaa chedu chirakanu draavaniditi Drohundanai jesitini - dehambu gaayambulanu llapall 5. ghorambugaa dooritini nerambulanu jesitini Kroorundanai gottitini - ghorampu paapini devaa llapall 6. chinditi raktamu naakai - pondina debbalacheta Nindalu pettitinayyo - sandehamelanayyaa llapall 7. shikshaku paatrudanayyaa - rakshana dechchitivayyaa Akshayabhaagyamuniyya - mokshambu joopitivayyaa llapall
Comments
Post a Comment