ప్రభు యేసు నా రక్షకా
ప్రభు యేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు నిరతము
నే నిన్ను జూడ (2) అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||
1. ప్రియుడైన యోహాను పత్మాసులో - ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె - ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభుయేసు||
2. లెక్కలేని మార్లు పడిపోతిని - దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి - గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
3. ఎరిగి యెరిగి నే చెడిపోతిని - యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి - దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
4. ఎందరేసుని వైపు చూచెదరో - పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు - ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||
5. విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ - కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు - విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||
6. కంటికి కనబడని వెన్నియో - చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో - సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు||
7. లోక భోగాలపై నా నేత్రాలు - సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును - నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
prabhu yesu naa rakshakaa - nosagu kannulu naaku niratamu
ne ninnu jooda (2) alphayu neeve – omegayu neeve (2) ||prabhu yesu||
1. priyudaina yohaanu patmaasulo - priyamaina yesu nee svaroopamu (2)
priyamaara joochi bahu dhanyudayye - priya prabhu ninnu joodanimmu (2) ||prabhuyesu||
2. lekkaleni maarlu padipotini - dikkulenivaada nenaitini (2)
chakkajesi naa netraalu derachi - grakkuna ninnu joodanimmu (2) ||prabhu yesu||
3. erigi yerigi ne chedipotini - yesu nee gaayamu repitini (2)
mosapoti nenu drushti dolagiti - daasuda nannu joodanimmu (2) ||prabhu yesu||
4. endaresuni vaipu choochedaro - pondedaru velgu mukhamuna (2)
sandiyambu leka santoshinchuchu - munduku parugettedaru (2) ||prabhu yesu||
5. vishvaasakartaa o yesu prabhoo - konasaaginchuvaadaa yesu prabhoo (2)
vinayamuto nenu nee vaipu joochuchu - visugaka parugetta nerpu (2) ||prabhu yesu||
6. kantiki kanabadani venniyo - cheviki vinabadani venniyo (2)
hrudaya gocharamu kaani venniyo - siddhaparachitiva naakai (2) ||prabhu yesu||
7. loka bhogaalapai naa netraalu - sokakundunatlu krupa joopumu (2)
nee mahima divya svaroopamunu - nindaara nanu joodanimmu (2) ||prabhu yesu||
Comments
Post a Comment