ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||
1.తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||
2.భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||
3.బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||
4.ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||
Prema yesuni prema adi evvaru koluvalenidi Nijamu deenini nammu idi bhuvi andinchalenidi Ennadennadu maaranidi naa yesuni divya prema Ennadennadu veedanidi naa yesuni nitya prema ||prema|| 1.Tallidandrula prema needa vale gatiyinchunu Kannabiddala prema kalalaa karigipovunu ||ennadennadu|| 2.Bhaaryaa bhartala madhya vikasinchina prema pushpamu Vaadipoyi raalunu tvaralo modulaa migilipovunu ||ennadennadu|| 3.Bandhumitrulayandu veluguchunna prema deepamu Noone unnanta kaalame velugunichchi aaripovunu ||ennadennadu|| 4.Dharalona premalanniyu sthiramu kaavu tarigipovunu Kreestu yesu kalvari premaa kadavaraku aadarinchunu ||ennadennadu||
Comments
Post a Comment