ప్రియ యేసు నిర్మించితివి
ప్రియ యేసు నిర్మించితివి - ప్రియమార నా హృదయం
ముదమార వసియించునా - హృదయాంతరంగమున
1.నీ రక్త ప్రభావమున -నా రోత హృదయంబును (2)
పవిత్రపరచుము తండ్రి -ప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు||
2.అజాగరూకుడనైతి - నిజాశ్రయమును విడచి (2)
కరుణారసముతో నాకై - కనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు||
3.వికసించె విశ్వాసంబు - వాక్యంబును చదువగనే (2)
చేరితి నీదు దారి - కోరి నడిపించుము (2) ||ప్రియ యేసు||
4.ప్రతి చోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండునట్లు (2)
ఆత్మాభిషేకమునిమ్ము - ఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు||
Priya yesu nirminchitivi - priyamaara naa hrudayam
Mudamaara vasiyinchunaa - hrudayaantarangamuna
1.nee rakta prabhaavamuna -naa rota hrudayambunu (2)
Pavitraparachumu tandri -prati paapamunu kadigi (2) ||priya yesu||
2.ajaagarookudanaiti - nijaashrayamunu vidachi (2)
Karunaarasamuto naakai - kanipettitivi tandri (2) ||priya yesu||
3.vikasinche vishvaasambu - vaakyambunu chaduvagane (2)
Cheriti needu daari - kori nadipinchumu (2) ||priya yesu||
4.prati chota nee saakshigaa - prabhuvaa nenundunatlu (2)
Aatmaabhishekamunimmu - aatmeeya roopundaa (2) ||priya yesu||
Comments
Post a Comment