ప్రార్ధన యేసుని సందర్శన
ప్రార్ధన…….. యేసుని సందర్శన - పరమ తండ్రితో - సంభాషణ
1.కరములెత్తి ప్రార్ధించగా - పరమ తండ్రి కౌగిలించును
స్వరమునెత్తి ప్రార్ధించగా….. మధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన||
2.తండ్రి అని నే పిలువగా - తనయుడా అని తా బల్కును
ఆదుకొనును అన్ని వేళలా….. కన్నీరంతయు తుడిచివేయున్ ||ప్రార్ధన||
3.మోకరించి ప్రార్ధించగా - సమీపముగా వేంచేయును
మనవులెల్ల మన్నించును …..మహిమతో నలంకారించును ||ప్రార్ధన||
4.కుటుంబముతో ప్రార్ధించగా - కొదువ ఏమియు లేకుండును
ఐక్యతలో నివసించును …… శాశ్వత జీవము అచటుండును ||ప్రార్ధన||
5.సంఘముగను ప్రార్ధించగా - కూడిన చోటు కంపించును
పరిశుద్ధాత్ముడు దిగివచ్చును ……. ఆత్మ వరములతో నింపును||ప్రార్ధన||
6.ఉపవాసముతో ప్రార్ధించగా - కీడులన్నియు తొలగిపోవును
కొట్లు ధాన్యముతో నింపును - క్రొత్త పానము త్రాగించును ||ప్రార్ధన||
7.ఏకాంతముగా ప్రార్ధించగా - నీతిని నాకు నేర్పించును
యేసు రూపము నాకిచ్చును ……యేసు రాజ్యము నను చేర్చును||ప్రార్ధన||
Praardhana…….. yesuni sandarshana - parama tandrito - sambhaashana 1.karamuletti praardhinchagaa - parama tandri kaugilinchunu Svaramunetti praardhinchagaa….. madhura svaramuto maataadunu ||praardhana|| 2.tandri ani ne piluvagaa - tanayudaa ani taa balkunu Aadukonunu anni velalaa….. kanneerantayu tudichiveyun ||praardhana|| 3.mokarinchi praardhinchagaa - sameepamugaa vencheyunu Manavulella manninchunu …..mahimato nalankaarinchunu ||praardhana|| 4.kutumbamuto praardhinchagaa - koduva emiyu lekundunu Aikyatalo nivasinchunu …… shaashvata jeevamu achatundunu ||praardhana|| 5.sanghamuganu praardhinchagaa - koodina chotu kampinchunu Parishuddhaatmudu digivachchunu ……. aatma varamulato nimpunu||praardhana|| 6.upavaasamuto praardhinchagaa - keedulanniyu tolagipovunu Kotlu dhaanyamuto nimpunu - krotta paanamu traaginchunu ||praardhana|| 7.ekaantamugaa praardhinchagaa - neetini naaku nerpinchunu Yesu roopamu naakichchunu ……yesu raajyamu nanu cherchunu||praardhana||
Comments
Post a Comment