ప్రార్థించు యోధులు లేవాలి

ప్రార్థించు యోధులు లేవాలి  - ప్రార్థించి ఆత్మల గెలవాలి
సడలిన మోకాళ్ళు బలపరచి  -  ప్రార్ధించు వరమును పొందాలి

1. అహమును ప్రభుకు లోబరచి  -  దీనమనస్సును ధరియించి
    యేసుని చెంత కూర్చుంటే దేశం క్షేమం పొందునులే      ॥ప్రార్థించు॥   

2. వేకువ ప్రార్ధన శక్తినొంది  -   విజ్ఞాపనలు అధికం చేసి
    దేశము నాశనమగుచుండ  -  ఆసక్తితో ప్రార్దించెదము   ॥ప్రార్థించు॥

3. బండ సందులలో నిలుచువాడు  -   ధైర్యముగా ప్రకటించునట్లు
    ఉజ్జీవజ్వాలలు ఆరకుండ - ప్రార్థించి దేశాన్ని అలంకరిద్దాం    ॥ప్రార్థించు॥ 


praarthinchu yodhulu levaali - praarthinchi aatmala gelavaali sadalina mokaallu balaparachi - praardhinchu varamunu pondaali. 1. ahamunu prabhuku lobarachi - deenamanassunu dhariyinchi yesuni chenta koorchunte desham kshemam pondunule ॥praarthinchu॥ 2. vekuva praardhana shaktinondi - vijnyaapanalu adhikam chesi deshamu naashanamaguchunda - aasaktito praardinchedamu ॥praarthinchu॥ 3. banda sandulalo niluchuvaadu - dhairyamugaa prakatinchunatlu ujjeevajvaalalu aarakunda - praarthinchi deshaanni alankariddaam ॥praarthinchu॥



Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు