Sunday, 22 February 2026

ప్రార్థన వినెడి పావనుడా

ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా  ||ప్రార్థన||

శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రనుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా   ||ప్రార్థన||

పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా  ||ప్రార్థన||

దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యి దిటముగా కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా   ||ప్రార్థన||

శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా  ||ప్రార్థన||

No comments:

Post a Comment

Have you been to Jesus

1. Have you been to Jesus for the cleansing pow'r?     Are you washed in the blood of the Lamb ?     Are you fully trusting in His grac...