ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె

ప్రభు యేసుని వదనములో - నా దేవుడు కనిపించె
పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో
పరలోకముకై చిరజీవముకై - ప్రార్థించెను నాహృదయం

1.దిశలన్నియు తిరిగితిని - నా పాపపు దాహముతో
దౌష్ట్యములో మసలుచును - దౌర్జన్యము చేయుచును
ధనపీడనతో - మృగవాంఛలతో (2) దిగజారితి చావునకు

2.చెండాడితి బ్రతుకులను - దహియించితి గృహములను
చెరగవు నా పాపములు - తరగవు నా వేదనలు
చనిపోయినను - ధరవీడినను (2) చల్లారవు శోకములు

3. పలుమారులు వినుచుంటి - నజరేయుని నీతికథ
పరిహాసము చేసితిని - పరమార్ధమే మోసమని
పశుప్రాయుడనై - జీవించుటచే (2) ప్రాప్తించెను ఈ సిలువ 

4.కలువరి ఆవరణములో - కరుణాత్ముని చేరువనే
కనుమూసిన కాలములో - వెలుగుదయించిన వేళ
కనుగొంటిని నాదౌర్భాగ్య స్థితి (2) కంపించెను నాహృదయం

5. యేసూ నీ రాజ్యముతో - భువికేతెంచెడి రోజు
ఈ పాపిని క్షమియించి - జ్ఞాపకముతో బ్రోవుమని
ఇలవేడితిని విలపించుచును (2) ఈడేరెను నా వినతి

6. పరదైసున ఈ దినమే - నా ఆనందములోను
పాల్గొందువు నీవనుచు - వాగ్దానము చేయగనే
పరలోకమే నాతుది యూపిరిగా (2) పయనించితి ప్రభుకడకు

Prabhu yesuni vadanamulo - naa devudu kanipinche Paapaatmula brochutakai krupalolikina kaluvarilo paralokamukai chirajeevamukai - praarthinchenu naahrudayam 1.dishalanniyu tirigitini - naa paapapu daahamuto Daushtyamulo masaluchunu - daurjanyamu cheyuchunu Dhanapeedanato - mrugavaanchhalato (2) digajaariti chaavunaku 2.chendaaditi bratukulanu - dahiyinchiti gruhamulanu Cheragavu naa paapamulu - taragavu naa vedanalu Chanipoyinanu - dharaveedinanu (2) challaaravu shokamulu 3. palumaarulu vinuchunti - najareyuni neetikatha Parihaasamu chesitini - paramaardhame mosamani Pashupraayudanai - jeevinchutache (2) praaptinchenu ee siluva 4.kaluvari aavaranamulo - karunaatmuni cheruvane Kanumoosina kaalamulo - velugudayinchina vela kanugontini naadaurbhaagya sthiti (2) kampinchenu naahrudayam 5. yesoo nee raajyamuto - bhuviketenchedi roju Ee paapini kshamiyinchi - jnyaapakamuto brovumani Ilaveditini vilapinchuchunu (2) eederenu naa vinati 6. paradaisuna ee diname - naa aanandamulonu Paalgonduvu neevanuchu - vaagdaanamu cheyagane Paralokame naatudi yoopirigaa (2) payaninchiti prabhukadaku

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు