పైలం కొడుకా పాపం చేయకురా

పైలం కొడుకా పాపం చేయకురా

యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా

పైలం కొడుకా పైలం కొడుకా

పైలం కొడుకా పైలం కొడుకా

పైలం కొడుకా పాపం చేయకురా

యేసయ్యను నమ్ముకొని మంచిగా బతుకురా

నీ మనసు మార్చుకొని మంచిగా బతుకురా


1.ఉడుకు రక్తము ఉరుకలు పెడ్తది
పాపం చెయ్యమని ఒత్తిడి చేస్తది
పాపమన్నది పాములాంటిది
పగ పడ్తది ప్రాణం తీస్తది  ||పైలం||

2.మనిషి జీవితం విలువయ్యింది
మరువకు కొడుకా మరణమున్నదని
బ్రతికింది ఇది బ్రతుకు కాదురా
సచ్చినంక అసలాట ఉంటది   ||పైలం||

3.కత్తి కన్న పదునెక్కువ కొడుకా
మనిషి కోపము మంచిది కాదు
కాలు జారితే తీసుకోవచ్చురా
నోరు జారితే తీసుకోలేము    ||పైలం||

4.క్రైస్తవ జీవితం విలువయ్యింది
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిప్పులాగ బ్రతకాలిరా కొడుకా
నిందలన్ని మొయ్యాలిరా కొడుకా   ||పైలం||

5.విచ్చలవిడిగా తిరుగుతున్నావు
ఎవరు చూడరని ఎగురుతున్నావు
చూసే దేవుడేసయ్య ఉన్నడు
తోలు తీస్తడు జాగ్రత్త కొడుకా ||పైలం||

6.గుట్కలు తినకురా గుటుక్కున చస్తావు
పొగాకు తినకురా పోతవు నరకం
సినిమా చూడకు చింతలు తప్పవు
ఫోజులు కొట్టకు పోతవు నరకం  ||పైలం||

7.కుమ్మరి పురుగు గుణం చూడరా
బురదల ఉంటది బురదే అంటదు
తామెర పువ్వు బురుదల ఉంటది
వరదొస్తే తల వంచుకుంటది    ||పైలం||

8.ఎన్నో ఆశలు పెట్టుకున్నరా
సేవ చేస్తే నిను చూడాలని
నా కలలను కల్ల చెయ్యకు కొడుకా
కాళ్ళు మొక్కుతా మయ్యగానిరా   ||పైలం||

9.పొందుకున్నవు రక్షణ నీవు
పోగొట్టుకోకు పోతవు నరకం
నరకమంటే ఆషామాషీ కాదురో
అగ్ని ఆరదు పురుగు చావదు    ||పైలం||

10.ప్రపంచమంతటా పాపమున్నది
మందులేని మాయ రోగమున్నది
నీ పచ్చని జీవితం పాడు చేసుకోకు ఓ కొడకా
నీవు మంచిగా బ్రతికేసయ్యను మహిమపరచు నా కొడకా  ||పైలం||

11.నీవు సి ఎం అయితే సంతోషముండదు పి ఎం అయితే సంతోషముండదు
యాక్టర్ అయితే సంతోషముండదు డాక్టర్ అయితే సంతోషముండదు
నీవు సేవ చేస్తే నేను చూడాలి కొడుకా
నువ్వు శ్రమలు అనుభవించాలిరా నా కొడుకా   ||పైలం||   Pailam kodukaa paapam cheyakuraa Yesayyanu nammukoni manchigaa batukuraa Pailam kodukaa pailam kodukaa Pailam kodukaa pailam kodukaa Pailam kodukaa paapam cheyakuraa Yesayyanu nammukoni manchigaa batukuraa Nee manasu maarchukoni manchigaa batukuraa 1.uduku raktamu urukalu pedtadi Paapam cheyyamani ottidi chestadi Paapamannadi paamulaantidi Paga padtadi praanam teestadi ||pailan|| 2.manishi jeevitam viluvayyindi Maruvaku kodukaa maranamunnadani Bratikindi idi bratuku kaaduraa Sachchinanka asalaata untadi ||pailan|| 3.katti kanna padunekkuva kodukaa Manishi kopamu manchidi kaadu Kaalu jaarite teesukovachchuraa Noru jaarite teesukolemu ||pailan|| 4.kraistava jeevitam viluvayyindi Nippulaaga bratakaaliraa kodukaa Nippulaaga bratakaaliraa kodukaa Nindalanni moyyaaliraa kodukaa ||pailan|| 5.vichchalavidigaa tirugutunnaavu Evaru choodarani egurutunnaavu Choose devudesayya unnadu Tolu teestadu jaagratta kodukaa ||pailan|| 6.gutkalu tinakuraa gutukkuna chastaavu Pogaaku tinakuraa potavu narakam Sinimaa choodaku chintalu tappavu Phojulu kottaku potavu narakam ||pailan|| 7.kummari purugu gunam choodaraa Buradala untadi burade antadu Taamera puvvu burudala untadi Varadoste tala vanchukuntadi ||pailan|| 8.enno aashalu pettukunnaraa Seva cheste ninu choodaalani Naa kalalanu kalla cheyyaku kodukaa Kaallu mokkutaa mayyagaaniraa ||pailan|| 9.pondukunnavu rakshana neevu Pogottukoku potavu narakam Narakamante aashaamaashee kaaduro Agni aaradu purugu chaavadu ||pailan|| 10.prapanchamantataa paapamunnadi Manduleni maaya rogamunnadi Nee pachchani jeevitam paadu chesukoku o kodakaa Neevu manchigaa bratikesayyanu mahimaparachu naa kodakaa ||pailan|| 11.neevu si em ayite santoshamundadu pi em ayite santoshamundadu Yaaktar ayite santoshamundadu daaktar ayite santoshamundadu Neevu seva cheste nenu choodaali kodukaa Nuvvu shramalu anubhavinchaaliraa naa kodukaa ||pailan||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు