ప్రార్ధన వినెడి పావనుడా

ప్రార్థన వినెడి పావనుడా - ప్రార్థన మాకు నేర్పుమయా  ||ప్రార్థన||

1.శ్రేష్టమైన భావము గూర్చి - శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రనుతించెదము - పరలోక ప్రార్థన నేర్పుమయా   ||ప్రార్థన||

2.పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన - సుంకరి ప్రార్థన నేర్పుమయా  ||ప్రార్థన||

3.దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యి దిటముగా కొండను - చేసిన ప్రార్థన నేర్పుమయా   ||ప్రార్థన||

4.శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్థన నేర్పుమయా  ||ప్రార్థన||

Praarthana vinedi paavanudaa - praarthana maaku nerpumayaa ||praarthana|| 1.shreshtamaina bhaavamu goorchi - shishya brundamuku nerpitivi Paramuda ninnu pranutinchedamu - paraloka praarthana nerpumayaa ||praarthana|| 2.parama devudavani telisi - karamu letti jantagaa modchi Shiramunuvanchi sariganu vedina - sunkari praarthana nerpumayaa ||praarthana|| 3.dinadinambu chesina seva - daiva chittamuku saripova Deenudavayyi ditamugaa kondanu - chesina praarthana nerpumayaa ||praarthana|| 4.shatrumooka ninu chuttukoni - siluvapaina ninu jampaganu Shaantamuto nee shatrula brovaga - salipina praarthana nerpumayaa ||praarthana||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు