యేసు దేవా నను కొనిపోవా

యేసు దేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా (2)

శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది

శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది

నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను

అంత వరకు నీదు శక్తినిమ్మయా

నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను

అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము  ||యేసు||


1.ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది
ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది (2)
నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా
నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా (2)  ||యేసు||

2.నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను
నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను (2)
నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము
నీ ఆత్మ శక్తితో నను బలపరచుము
నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు
కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను  ||యేసు||


Yesu devaa nanu konipovaa nee raajyamukai vechiyunnaa (2) Shaanti leni lokaana – nee prema karuvayyindi Shaanti leni lokaana – nee prema kanumarugayyindi Nee raaka kosame ne eduru choostunnaanu Anta varaku needu shaktinimmayaa Nee raaka kosame ne eduru choostunnaanu Anta varaku nannu needu saakshigaa nilpumu ||yesu|| 1.etu choosinaa akramame kanabadutundi Etu tiriginaa anyaayam prabali undi (2) Nee premato nanu kaachi kaapaadu devaa Nee raaka varaku nanu nilabettumu devaa (2) ||yesu|| 2.nee raajyamukai ee lokamulo nee kaadini mosedanu Neevu preminchina nee biddalanu nee mandalo cherchedanu (2) Nee aatma toduto nanu bratikinchumu Nee aatma shaktito nanu balaparachumu Nee mahima raajyamandu neeto koodaa vasiyinchutaku Kada varaku ee bhuvilo nammakangaa bratikedanu ||yesu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు