యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు

యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2)

యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2)

స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి

ఘనతా బలము కలుగును ఆమెన్ (2)   ||యేసే||


1.మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను (2)
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2)    ||స్తోత్రము||

2.ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును (2)
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2)  ||స్తోత్రము||

3.జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను (2)
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2)   ||స్తోత్రము||

Yese goppa devudu – mana yese shaktimantudu (2) Yese prema poornudu – yugayugamulu stutipaatrudu (2) Stotramu mahima jnyaanamu shakti Ghanataa balamu kalugunu aamen (2) ||yese|| 1.mahaa shramalalo vyaadhi baadhalalo Sahanamu choopi sthiramuga nilachina Yobu vale ne jeevinchedanu (2) Adviteeyudu aadisambhootudu Deergha shaantudu mana prabhu yese (2) ||stotramu|| 2.praarthana shaktito aatma balamuto Lokamunaku prabhuvunu chaatina Daaniyelu vale jeevintunu (2) Mahonnatudu mana rakshakudu Aashraya durgamu mana prabhu yese (2) ||stotramu|| 3.jeevitamantaa prabhuto nadachi Ento ishtudai saakshyamu pondina Hanoku vale ne jeevinchedanu (2) Adbhutakarudu aashcharyakarudu Neeti sooryudu mana prabhu yese (2) ||stotramu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు