యేసుతో ఠీవిగాను పోదమా
యేసుతో ఠీవిగాను పోదమా - అడ్డుగా వచ్చు వైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో||
1.రారాజు సైన్యమందు చేరను - ఆ రాజు దివ్య సేవ చేయను (2)
యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2)
యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
2.విశ్వాస కవచమును ధరించుచు - ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2)
అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2)
యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
3.శోధనలు మనల చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్ని తగిలినా (2)
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2)
యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||
4.ఓ యువతి యువకులారా చేరుడి -శ్రీ యేసురాజు వార్త చాటుడి (2)
లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2)
సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||
Yesuto theevigaanu podamaa - addugaa vachchu vairi gelvanu Yuddhanaadambuto bodamu ||yesuto|| 1.raaraaju sainyamandu cheranu - aa raaju divya seva cheyanu (2) Yesu raaju mundugaa dhvajamu batti naduvagaa (2) Yesuto theevigaanu vedalanu ||yesuto|| 2.vishvaasa kavachamunu dharinchuchu - aa raaju naajnya madini nilpuchu (2) Anudinambu shaktini ponduchunnavaaramai (2) Yesuto theevigaanu vedalanu ||yesuto|| 3.shodhanalu manala chutti vachchinaa - saataanu ambulenni tagilinaa (2) Bhayamuledu manakika prabhuvu chenta nundumu (2) Yesuto theevigaanu vedalanu ||yesuto|| 4.o yuvati yuvakulaaraa cherudi -shree yesuraaju vaarta chaatudi (2) Lokamanta ekamai yesunaathu golvanu (2) Saadhanambevaru neevu nenegaa ||yesuto||
Comments
Post a Comment