హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ||
1.పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ||
2.కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ||
3.ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ||
4.అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) ||హృదయ||
5.జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2) ||హృదయ||
6.సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2) ||హృదయ||
7.చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2) ||హృదయ||
8.అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2) ||హృదయ||
9.బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) ||హృదయ||
Hrudayamanedu talupu nodda – yesu naathundu Nilachi – sadayudaguchu dattuchundu – sakala vidhamulanu (2) ||hrudaya|| 1.paruni boli niluchunnaadu – parikinchi chooda Natadu – parudu gaadu rakshakundu – praana snehitudu (2) ||hrudaya|| 2.karunaa sheelundatadu gaana – gaachi yunnaadu Yesu – karuna nerigi gaaravimpa – garamu nyaayambu (2) ||hrudaya|| 3.enta sepu niluva betti – yedpintu ratani Naata – dento dayache biluchuchunnaa – dippudu mimmulanu (2) ||hrudaya|| 4.atadu mitrudatadu mitrum – dakhila paapulaku Meera – latani pilupu vinti reni – yatadu priyudagunu (2) ||hrudaya|| 5.jaali cheta dana hastamula – jaapi yunnaadu Mimmu – naalinganamu seya gori – yanishamu kanipettu (2) ||hrudaya|| 6.saatileni dayagala vaadu – sarveshu sutudu Tana – maata vinedu vaarala nella – sootiga rakshinchu (2) ||hrudaya|| 7.cherchukonudi mee hrudayamuna – shree yesunaathu Natadu – cherchukonuchu mee kichchunu – cheera jeevamu krupanu (2)||hrudaya|| 8.atadu tappaka kalugajeyu – nakhila bhaagyamulu Meera – latani hattukondu rappu – daanandamu toda (2) ||hrudaya|| 9.bratuku shaashvatambu kaadu – parikinchu choodu Gaana – bratiki yundu kaalamunane – prabhuni goluvandi (2) ||hrudaya||
Comments
Post a Comment