సీయోను పాటలు సంతోషముగా

సీయోను పాటలు సంతోషముగా - పాడుచు సీయోను వెల్లుదము (2)


1.లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు - కొంతకాలమెన్నో శ్రమలు (2)        ||సీయోను||

2.ఐగుప్తును విడచినట్టి మీరు - అరణ్యవాసులే ఈ ధరలో (2)
నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానానుపై నిల్పుడి (2)    ||సీయోను||

3.మారాను పోలిన చేదైన స్థలముల - ద్వారా పోవలసియున్ననేమి (2)
నీ రక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాట నమ్ము (2)||సీయోను||

4.ఐగుప్తు ఆశలనన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి (2)
పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి (2)           ||సీయోను||

5.ఆనందమయ పరలోకంబు మనది - అక్కడనుండి వచ్చునేసు (2)
సీయోను గీతము సొంపుగ కలసి - పాడెదము ప్రభుయేసుకు జై (2)||సీయోను|| Seeyonu paatalu santoshamugaa Paaduchu seeyonu velludamu (2) 1.Lokaana shaashvataanandamemiyu - Ledani cheppenu priyudesu (2) Pondavale nee lokamunandu - Kontakaalamenno shramalu (2) ||seeyonu|| 2.Aiguptunu vidachinatti meeru - Aranyavaasule ee dharalo (2) Nityanivaasamu ledilalona - Netraalu kaanaanupai nilpudi (2) ||seeyonu|| 3.Maaraanu polina chedaina sthalamula - Dvaaraa povalasiyunnanemi (2) Nee rakshakundagu yese nadupunu - Maarani tanadu maata nammu (2) ||seeyonu|| 4.Aiguptu aashalananniyu vidichi - Ranguga yesuni vembadinchi (2) Paadaina korahu paapambumaani - Vidheyulai viraajilludi (2) ||seeyonu|| 5.Aanandamaya paralokambu manadi - Akkadanundi vachchunesu (2) Seeyonu geetamu sompuga kalasi - Paadedamu prabhuyesuku jai (2) ||seeyonu||


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు