సేవకులారా సువార్తికులారా
సేవకులారా సువార్తికులారా- యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా - మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా - మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము - నీ కొరకై జీవించెదము ||సేవకులారా||
1.దైవాజ్ఞను నెరవేర్చుటకు – మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు – ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు – హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు – అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||
2.సంఘమును కాపాడుటలో – కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో – సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు – అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము – ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||
3.సువార్తను అందించుటకు – ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని – సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు – క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము – మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
Sevakulaaraa suvaartikulaaraa
Yesayya korukunna shraamikulaaraa
Sevakulaaraa suvaartikulaaraa
Mee maadirikai vandanamu
Unnata panikai mammunu pilachina devaa
Maa korakai nee praanam arpinchitivi
Neelo nilichi yundute maa bhaagyamu
Nee korakai jeevinchedamu ||sevakulaaraa||
1.Daivaajnyanu neraverchutaku – maa kosam bali ayyaaru
Prabhu raajyam prakatinchutaku – praanaalani ila virichaaru
Maa aatmalu rakshinchutaku – hata saakshulu meerayyaaru
Neeti kireetamu pondutaku – arhulugaa meerunnaaru ||unnata||
2.Sanghamunu kaapaadutalo – kaaparuluga meerunnaaru
Suvaartakai poraadutalo – siddhapadina sainyam meeru
Mee premanu erugani vaaru – anyaayamuga mimu champaaru
Mee tyaagam memu – ennatikee marachipomu ||sevakulaaraa||
3.Suvaartanu andinchutaku – enno hinsalu pondaaru
Aakalito mokaallooni – sanghamunu poshinchaaru
Maaku maadiri choopinchutaku – kreestuni poli jeevinchaaru
Mee jata pani vaarame memu – mee jaadalo ika nilichedamu ||unnata||
Comments
Post a Comment