సుమధుర స్వరముల గానాలతో
సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే - నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
1.ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే నా ఆనందము - (నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర||
2.సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే నా జయగీతము - (నీవే) నీవే నా స్తుతిగీతము (2) ||సుమధుర||
3.వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే నా అతిశయము - (నీకే) నీకే నా ఆరాధన (2) ||సుమధుర||
Sumadhura svaramula gaanaalato – velaadi dootala galamulato
Koniyaadabaduchunna naa yesayyaa – neeke naa aaraadhana (2)
Mahadaanandame naalo paravashame
Ninnu stutinchina prateekshanam (2) ||sumadhura||
1.Edaari trovalo ne nadachinaa – erugani maargamulo nanu nadipinaa
Naa mundu nadachina jayaveerudaa – naa vijaya sanketamaa (2)
Neeve neeve naa aanandamu -
(neeve) neeve naa aadhaaramu (2)||sumadhura||
2.Sampoornamaina nee chittame – anukoolamaina sankalpame
Jariginchuchunnaavu nanu viduvaka – naa dhairyamu neevegaa (2)
Neeve neeve naa jayageetamu -
(neeve) neeve naa stutigeetamu (2)||sumadhura||
3.Velaadi nadulanni nee mahimanu – tarangapu pongulu nee balamunu
Parvata shrenulu nee keertine – prakatinchuchunnavegaa (2)
Neeve neeve naa atishayamu -
(neeke) neeke naa aaraadhana (2) ||sumadhura||
Comments
Post a Comment