మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా

మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా - విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2)

వెలిగే దీపానికి నూనె అవసరం - నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2)

నూనె లేని దీపము ఆరిపోవును - ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) llమోకాళ్ళll

1.శోధనలో పడకుండా ప్రార్ధించుము 
శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2)
కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2)
మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2)   ||మోకాళ్ళ||

2.ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా
పరలోక సంతోషం దేవుడిచ్చును (2)
పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2)
ఆకాశ జలములను మూసివేసెను (2)     ||మోకాళ్ళ||

3.అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును
అన్నాడు మన యేసు అడిగి చూడుము (2)
సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2)
అడిగిన వారందరికి తప్పక దయచేయును (2)    ||మోకాళ్ళ||

Mokaalla anubhavamu neeku unnadaa - Visugaka praardhinche manasu unnadaa (2) Velige deepaaniki noone avasaram - nee aatmaa deepaaniki praardhanavasaram (2) Noone leni deepamu aaripovunu - Praardhinchaleni jeevitamu patanamavvunu (2) llmokaallall 1.shodhanalo padakundaa praardhinchumu Shodhana tappinchutaku praardhinchumu (2) kanneetito praardhinchina hijkiyaanu choodumu (2) maranamu tappinchabadi aayushshu nondenu (2) ||mokaalla|| 2.prati nimishamandu manamu praardhinchagaliginaa Paraloka santosham devudichchunu (2) pattudalato praardhinchina eleeyaanu choodumu (2) aakaasha jalamulanu moosivesenu (2) ||mokaalla|| 3.adugudi meekivvabadunu tattudi meeku teeyabadunu annaadu mana yesu adigi choodumu (2) sakala aishvaryamulaku karta ayina devudu (2) adigina vaarandariki tappaka dayacheyunu (2) ||mokaalla||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు