మంగళమే యేసునకు – మానుజావతారునకు

మంగళమే యేసునకు – మానుజావతారునకు (3)

శృంగార ప్రభువునకు (2)

క్షేమాధిపతికి మంగళమే     ||మంగళమే||

1.పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)
నిరుపమానందునకు (2)
నిపుణ వేద్యునకు మంగళమే   ||మంగళమే||

2.దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)
కరుణా సంపన్నునకు (2)
జ్ఞాన దీప్తునకు మంగళమే     ||మంగళమే||

3.సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)
నిత్య స్వయంజీవునకు (2)
నిర్మలాత్మునకు మంగళమే    ||మంగళమే||

4.యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)
సత్య పరంజ్యోతి యగు (2)
సార్వభౌమునకు మంగళమే    ||మంగళమే||

5.నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3)
కరుదెంచిన మా పాలి (2)
వర రక్షకునకు మంగళమే      ||మంగళమే||

6.పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3)
పరమేశ్వర తనయునకు (2)
బ్రణుతింతుము నిన్ను మంగళమే  ||మంగళమే||

Mangalame yesunaku – maanujaavataarunaku (3) Shrungaara prabhuvunaku (2) Kshemaadhipatiki mangalame ||mangalame|| 1.parama pavitrunaku – vara divya tejunaku (3) nirupamaanandunaku (2) nipuna vedyunaku mangalame ||mangalame|| 2.durita sanhaarunaku – vara sugunodaarunaku (3) karunaa sampannunaku (2) jnyaana deeptunaku mangalame ||mangalame|| 3.satya pravartunaku – saddharma sheelunaku (3) nitya svayanjeevunaku (2) nirmalaatmunaku mangalame ||mangalame|| 4.yukta stotraarhunaku – bhakta rakshaamaniki (3) satya paranjyoti yagu (2) saarvabhaumunaku mangalame ||mangalame|| 5.nara ghora kalushamula – nurumaaranga nila (3) karudenchina maa paali (2) vara rakshakunaku mangalame ||mangalame|| 6.paramapuri vaasunaku – nara daiva roopunaku (3) parameshvara tanayunaku (2) branutintumu ninnu mangalame ||mangalame||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు