జీవితంబు ఘోర కష్టనష్టంబుల్

1. జీవితంబు ఘోర కష్టనష్టంబుల్ - ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
  దేవుడిచ్చినట్టి ఈవులెంచుము - నీ వాశ్చర్య మొందెదవు వానికై


అ.ప.   ఎంచుము లెక్కించు మీవులన్ - ఎంచిచూడు మేసుదీవెనల్
          ఎంచు మెంచు మెంచు మీవులన్ - వింత నొందెదవు నీవు వానికై


2. చింత మానసంబు నీకు గల్గినన్ -  వంతచే భారంబు గల్గ నీ యెదన్
    సంతసంబుతోడ నెంచు మీవులన్  - వింత నొందెదవు నీవు వానికై


3. నాశనంబు జెందు నాస్తి జూడగా - వాసిగా శ్రీ యేసు నీ కొసంగిన
  భాసురంపు భాగ్యముం దలంపుమా - యీ సౌభాగ్యమే గదా సదా యుండు


4. జీవితాదియందు ధైర్య మొందుము - దేవుడుండు నెల్లవార్కి తోడుగ
  జీవయాత్ర యందు సాయమియ్యగన్ - దేవదూతల్ నీకు తోడుగా నుండు 1. jeevitambu ghora kashtanashtambul - aavarinchi ninnu duhkhaparchina devudichchinatti eevulenchumu - nee vaashcharya mondedavu vaanikai A.pa. enchumu lekkinchu meevulan - enchichoodu mesudeevenal enchu menchu menchu meevulan - vinta nondedavu neevu vaanikai 2. chinta maanasambu neeku galginan - vantache bhaarambu galga nee yedan santasambutoda nenchu meevulan - vinta nondedavu neevu vaanikai 3. naashanambu jendu naasti joodagaa - vaasigaa shree yesu nee kosangina bhaasurampu bhaagyamum dalampumaa - yee saubhaagyame gadaa sadaa yundu 4. jeevitaadiyandu dhairya mondumu - devudundu nellavaarki toduga jeevayaatra yandu saayamiyyagan - devadootal neeku todugaa nundu

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు