జీవిత యాత్రలో నాదు గురి నీవెగా
జీవిత యాత్రలో నాదు గురి నీవెగా - నీకు సాటి యెవ్వరు యేసువా నీవు
నడిచావు కెరటాలపై - నన్ను నడిపించుమో యేసువా ||జీవిత||
1. నన్ను నడిపించు చుక్కాని నీవెగదా - నన్ను కాపాడు దుర్గంబు నీవెగదా
నీదు వాక్యంబు సత్యంబెగా - నాకు నిరతంబు జీవంబెగా
నేను పయనించు మార్గంబెగా - నన్ను నడిపించుమో యేసువా ॥జీవిత॥
2. నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే - నేను స్వరమెత్తి వినిపింతు నీ గానమే
నాకు నీవేగా సర్వస్వమూ నీదు నామంబె ఆధారము
నాకు సర్వేశ్వరుడ నీవేగా నిన్ను స్తుతియింతునో యేసువా ॥జీవిత॥
3. నాదు హృదయంబు నీ దివ్య సదనంబెగా - నీదు చిత్తంబునే చేయ ముదమాయెగా
నాదు హృదయాన లెక్కింతునా - నీదు ఉపకారములు యేసువా
వీటి కొరకేమి చెల్లింతునూ - నాదు స్తుతులందుకో యేసువా ॥జీవిత॥
Jeevita yaatralo naadu guri neevegaa - neeku saati yevvaru yesuvaa neevu Nadichaavu kerataalapai - nannu nadipinchumo yesuvaa ||jeevita|| 1. nannu nadipinchu chukkaani neevegadaa - nannu kaapaadu durgambu neevegadaa needu vaakyambu satyambegaa - naaku niratambu jeevambegaa nenu payaninchu maargambegaa - nannu nadipinchumo yesuvaa ॥jeevita॥ 2. naaku niratambu madilona nee dhyaaname - nenu svarametti vinipintu nee gaaname naaku neevegaa sarvasvamoo needu naamambe aadhaaramu naaku sarveshvaruda neevegaa ninnu stutiyintuno yesuvaa ॥jeevita॥ 3. naadu hrudayambu nee divya sadanambegaa - needu chittambune cheya mudamaayegaa naadu hrudayaana lekkintunaa - needu upakaaramulu yesuvaa veeti korakemi chellintunoo - naadu stutulanduko yesuvaa ॥jeevita॥
Comments
Post a Comment