జయహే జయహే
జయహే జయహే జయహే జయహే
జయ జయ దేవసుత జయ జయ విజయసుతా ॥జయహే॥
1. సిలువలో పాపికి విడుదల కలిగెను - విడుదల కలిగెను
కలువరిలో నవజీవన మొసగెను - జీవన మొసగెను
సిలువ పతాకము జయమును గూర్చెను
జయమని పాడెదను - నా విజయము పాడెదను (2) ॥జయహే॥
2. మరణపు కోటలో మరణమె సమసెను - మరణమె సమసెను
ధరణిలో జీవిత భయములు దీరెను - భయములు దీరెను
మరణములో సహా జయములు నావే
జయమని పాడెదను నా విజయము పాడెదను (2) ॥జయహే॥
3. శోధనలలో ప్రభుసన్నిధి దొరికెను - సన్నిధి దొరికెను
వేదనలే రణభూమిగ మారెను - భూమిగ మారెను
శోధన బాధలు బలమును గూర్చెను
జయమని పాడెదను నా విజయము పాడెదను (2) ॥జయహే॥
4. ప్రార్థన కాలము బహు ప్రియమాయెను - బహు ప్రియమాయెను
సార్ధకమాయెను దేవుని వాక్యము - దేవుని వాక్యము
ప్రార్థనలే బలిపీఠము లాయెను
జయమని పాడెదను నా విజయము పాడెదను (2) ॥జయహే॥
5. స్వాంతములో నిజశాంతి లభించెను శాంతి లభించెను
భ్రాంతులు వింతగ ప్రభు పరమాయెను ప్రభు పరమాయెను
స్వాంతమే సిలువకు సాక్షిగ వెలసెను
జయమని పాడెదను నా విజయము పాడెదను (2)
6. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను - ప్రాపక మొదవెను
వరుడగు యేసుని వధువుగా మారితి వధువుగ మారితి
పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను
జయమని పాడెదను నా విజయము పాడెదను (2) IIజయహేll
Jayahe jayahe jayahe jayahe
Jaya jaya devasuta jaya jaya vijayasutaa ॥jayahe॥
1. siluvalo paapiki vidudala kaligenu - vidudala kaligenu
kaluvarilo navajeevana mosagenu - jeevana mosagenu
siluva pataakamu jayamunu goorchenu
jayamani paadedanu - naa vijayamu paadedanu (2) ॥jayahe॥
2. maranapu kotalo maraname samasenu - maraname samasenu
dharanilo jeevita bhayamulu deerenu - bhayamulu deerenu
maranamulo sahaa jayamulu naave
jayamani paadedanu naa vijayamu paadedanu (2) ॥jayahe॥
3. shodhanalalo prabhusannidhi dorikenu - sannidhi dorikenu
vedanale ranabhoomiga maarenu - bhoomiga maarenu
shodhana baadhalu balamunu goorchenu
jayamani paadedanu naa vijayamu paadedanu (2) ॥jayahe॥
4. praarthana kaalamu bahu priyamaayenu - bahu priyamaayenu
saardhakamaayenu devuni vaakyamu - devuni vaakyamu
praarthanale balipeethamu laayenu
jayamani paadedanu naa vijayamu paadedanu (2) ॥jayahe॥
5. svaantamulo nijashaanti labhinchenu shaanti labhinchenu
bhraantulu vintaga prabhu paramaayenu prabhu paramaayenu
svaantame siluvaku saakshiga velasenu
jayamani paadedanu naa vijayamu paadedanu (2)
6. parishuddhaatmuni praapaka modavenu - praapaka modavenu
varudagu yesuni vadhuvugaa maariti vadhuvuga maariti
parishuddhudu nanu saakshiga pilachenu
jayamani paadedanu naa vijayamu paadedanu (2) IIjayahell
Comments
Post a Comment