జీవితాంతము వరకు నీకే
జీవితాంతము వరకు నీకే - సేవ సల్పుదునంటిని=నీవు
నాతోనుండి ధైర్యము - నిచ్చి నడుపుము రక్షకా
1. ఎన్ని యాటంకంబులున్నను - ఎన్ని భయములు కల్గిన=
అన్ని పోవును నీవు నాకడ - నున్న నిజమిది రక్షకా ॥జీవితా॥
2. అన్ని వేళల నీవు చెంతనె - యున్న యను భవమీయవె=
తిన్నగా నీ మార్గమందున - పూని నడచెద రక్షకా ॥జీవితా॥
3. నేత్రములు మిరుమిట్లుగొలిపెడి - చిత్రదృశ్యములున్నను=
శత్రువగు సాతాను గెల్వను చాలు నీకృప రక్షకా ॥జీవితా॥
4. నాదు హృదయమునందు వెలుపట- నావరించిన శత్రులన్=
చెదరగొట్టుము రూపుమాపుము - శీఘ్రముగ నా రక్షకా ॥జీవితా॥
5. మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే =
ఇహము దాటినదాక నిన్ను - వీడనంటిని రక్షకా ॥జీవితా॥
6. పాప మార్గము దరికిబోవక - పాత యాశల గోరక =
ఎపుడు నిన్నే వెంబడింపగ - కృప నొసంగుము రక్షకా ॥జీవితా॥
Jeevitaantamu varaku neeke - seva salpudunantini=neevu
Naatonundi dhairyamu - nichchi nadupumu rakshakaa
1. enni yaatankambulunnanu - enni bhayamulu kalgina=
anni povunu neevu naakada - nunna nijamidi rakshakaa ॥jeevitaa॥
2. anni velala neevu chentane - yunna yanu bhavameeyave=
tinnagaa nee maargamanduna - pooni nadacheda rakshakaa ॥jeevitaa॥
3. netramulu mirumitlugolipedi - chitradrushyamulunnanu=
shatruvagu saataanu gelvanu chaalu neekrupa rakshakaa ॥jeevitaa॥
4. naadu hrudayamunandu velupata- naavarinchina shatrulan=
chedaragottumu roopumaapumu - sheeghramuga naa rakshakaa ॥jeevitaa॥
5. mahimalo neevundu chotiki mammu jerchedanantive =
ihamu daatinadaaka ninnu - veedanantini rakshakaa ॥jeevitaa॥
6. paapa maargamu darikibovaka - paata yaashala goraka =
epudu ninne vembadimpaga - krupa nosangumu rakshakaa ॥jeevitaa॥
Comments
Post a Comment