జీవించుచున్నాడు యేసుప్రభూ
జీవించుచున్నాడు యేసుప్రభూ - నా హృదయములో నున్నాడు
కష్టములలో నా సహాయుడై - నిత్యము జీవించును ||జీవి||
1. మాటచే సాగరము పాయలైపోయె - కోట గోడలు కూలి మట్టమైనవి
గ్రుడ్డివాడు దృష్టిపొందె ప్రభు మాటచే - కుష్ఠరోగి శుద్ధుడాయె ప్రభు ముట్టగా ॥జీవి॥
2. మాటచే నీళ్ళను రసముగ మార్చ - మాటచే సూచక క్రియలు జరిగె
మాటచే సముద్రము పొంగు అణిగెన్ - మాటచే తుఫాను ఆపబడెను ॥జీవిll
3. సుఖారి పురమున సమరయ స్త్రీ - పాపము విడిచెను ప్రభు మాటచే
పాపముల్ క్షమించబడే యేసు మాటచే - సిలువపై దొంగ రక్షింపబడెను ॥జీవిll
4. దేవాలయపు తెర క్రింద వరకు - రెండుగ చినిగెను ప్రభు కేకచే
భూమి వణికి బండలు బ్రద్దలాయె - సమాధుల్ తెరవబడె యేసు మాటచే ॥జీవి॥
5. నన్ను వదలక పట్టుకొనుము - నిన్ను విడువక వెంబడింతును
మరణించు వేళ పరలోకపు - ఇంటికి నడుపు విమోచకుడా ॥జీవి॥
Jeevinchuchunnaadu yesuprabhoo - naa hrudayamulo nunnaadu
Kashtamulalo naa sahaayudai - nityamu jeevinchunu ||jeevi||
1. maatache saagaramu paayalaipoye -
kota godalu kooli mattamainavi
gruddivaadu drushtiponde prabhu maatache -
kushtharogi shuddhudaaye prabhu muttagaa ॥jeevi॥
2. maatache neellanu rasamuga maarcha -
maatache soochaka kriyalu jarige
maatache samudramu pongu anigen -
maatache tuphaanu aapabadenu ॥jeevill
3. sukhaari puramuna samaraya stree -
paapamu vidichenu prabhu maatache
paapamul kshaminchabade yesu maatache -
siluvapai donga rakshimpabadenu ॥jeevill
4. devaalayapu tera krinda varaku -
renduga chinigenu prabhu kekache
bhoomi vaniki bandalu braddalaaye -
samaadhul teravabade yesu maatache ॥jeevi॥
5. nannu vadalaka pattukonumu -
ninnu viduvaka vembadintunu
maraninchu vela paralokapu -
intiki nadupu vimochakudaa ॥jeevi॥
Comments
Post a Comment