జీవితమంత నీప్రేమ గానం
జీవితమంత నీప్రేమ గానం - ప్రణుతింతుమో మేము దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ - ఆనందగానంబుతో
1. సర్వ సమయములలో నీ స్తుతి గానం- ఎల్లవేళలయందు
నీ నామ ధ్యానం - మా కదియే మేలు- ఈ జీవితమున
స్తుతియింతు మా రక్షకా ॥జీవిత॥
2. సృష్టినంతటిని నీ మాటచేత - సృజియించితివిగా
మా దేవ దేవా - నీ ఘనమగు మహిమ వర్ణింప
తరమా - స్తుతియింతు నా రక్షకా ॥జీవిత॥
3 కలుపాతులమైన మా కొరకు నీ - విలువైన ప్రాణంబు నర్పించితివిగా
కలువరి గిరిపై - చూపిన ప్రేమన్ - స్తుతియింతు నా రక్షకా ॥జీవిత॥
4. పరిశుద్ధమైన నీ సన్నిధిలో - శాశ్వతమైన నీ రాజ్యంబులో
ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా - స్తుతియింతు నా రక్షకా ॥జీవిత॥
Jeevitamanta neeprema gaanam - pranutintumo memu devaa
Prachurintu memu nee keertin - aanandagaanambuto
1. sarva samayamulalo nee stuti gaanan- ellavelalayandu
nee naama dhyaanam - maa kadiye melu- ee jeevitamuna
stutiyintu maa rakshakaa ॥jeevita॥
2. srushtinantatini nee maatacheta - srujiyinchitivigaa
maa deva devaa - nee ghanamagu mahima varnimpa
taramaa - stutiyintu naa rakshakaa ॥jeevita॥
3 kalupaatulamaina maa koraku nee - viluvaina praanambu narpinchitivigaa
kaluvari giripai - choopina preman - stutiyintu naa rakshakaa ॥jeevita॥
4. parishuddhamaina nee sannidhilo - shaashvatamaina nee raajyambulo
premato nannu cherchukontivigaa - stutiyintu naa rakshakaa ॥jeevita॥
Comments
Post a Comment