జయశీలుడా మా యేసయ్య

జయశీలుడా మా యేసయ్య - జీవించువాడా మెస్సయ్య (2)
జయమిచ్చువాడా స్తోత్రము నా ప్రాణప్రియుడా వందనం
అ….  అ….  అ….  హల్లెలూయ   అ… హల్లెలూయ


1. బలమిచ్చువాడా బలవంతుడా - శక్తినిచ్చువాడా శక్తిమంతుడా
    తృప్తినిచ్చువాడా తనయులకు - ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా (2)
  మాకై మరలా రానుంటివా - యేసు మాకై మరలా రానుంటివా (2) ॥జయ॥


2 ఆదియు అంతం నీవేగా - ఆరాధ్యుడవు నీవేగా
  అత్యున్నతుడా అతి ప్రియుడా -  ఆత్మ స్వరూపి ఆశ్రయుడా (2)
  అనిశం నిన్నే కీర్తింతుము - యేసు అనిశం నిన్నే కీర్తింతుము (2) ॥జయ॥


3. నీవే దిక్కని నమ్మితిమి -  నిన్నే గురిగా ఎంచితిమి
  నీవే మాకు తండ్రివి - నీకు సమస్తం సాధ్యమే (2)
  నీపై సర్వం మోపితిమి యేసు నీపై సర్వం మోపితిమి (2) ॥జయ॥ Jayasheeludaa maa yesayya - jeevinchuvaadaa messayya (2) Jayamichchuvaadaa stotramu naa praanapriyudaa vandanam A…. a…. a…. hallelooya a… hallelooya 1. balamichchuvaadaa balavantudaa - shaktinichchuvaadaa shaktimantudaa truptinichchuvaadaa tanayulaku - muktinichchuvaadaa mrutyunjayudaa (2) maakai maralaa raanuntivaa - yesu maakai maralaa raanuntivaa (2) ॥jaya॥ 2 aadiyu antam neevegaa - aaraadhyudavu neevegaa atyunnatudaa ati priyudaa - aatma svaroopi aashrayudaa (2) anisham ninne keertintumu - yesu anisham ninne keertintumu (2) ॥jaya॥ 3. neeve dikkani nammitimi - ninne gurigaa enchitimi neeve maaku tandrivi - neeku samastam saadhyame (2) neepai sarvam mopitimi yesu neepai sarvam mopitimi (2) ॥jaya॥


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు