చూడుము గెత్సేమనే
చూడుము గెత్సేమనే - తోటలో నా ప్రభువు
పాపి నాకై విజ్ఞాపన చేసెడి - ధ్వని వినబడుచున్నది
1. దేహమంతయు నలిగి - శోకము చెందినవాడై - దేవాది
దేవుని ఏక సుతుడు పడు - వేదనలు నా కొరకే ॥చూడుll
2. తండ్రి ఈ పాత్ర తొలగన్ - నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితి వనెను ॥చూడుll
3. రక్తపు చెమట వలన - మిక్కలి బాధనొంది రక్షకుడేసు
హృదయము పగులగ - విజ్ఞాపనము చేసెనే ॥చూడుll
4. ముమ్మారు భూమి మీద - పడి మిక్కిలి వేదనచే
మన యేసుప్రభువు తానే వేడుకొనెను - పాపుల విమోచన కొరకే ॥చూడుll
5. ప్రేమతో కూడిన వాక్కులచే - ఆవరించెడి ప్రభువు
వేదన సమయమున ఆదరించువారు - లేక బాధ నొందెను ॥చూడు॥
6. నిన్ను తన వలె మార్చెడి - ఈ మహా ప్రేమను
తలచి తలచి హృదయము కరుగగా - నే సదా కీర్తించెదను ॥చూడు॥
Choodumu getsemane - totalo naa prabhuvu
Paapi naakai vijnyaapana chesedi - dhvani vinabaduchunnadi
1. dehamantayu naligi - shokamu chendinavaadai - devaadi
devuni eka sutudu padu - vedanalu naa korake ॥choodull
2. tandri ee paatra tolagan - nee chittamaina yedala
etlayinanu nee chittamu cheyutaku
nannappaginchiti vanenu ॥choodull
3. raktapu chemata valana - mikkali baadhanondi rakshakudesu
hrudayamu pagulaga - vijnyaapanamu chesene ॥choodull
4. mummaaru bhoomi meeda - padi mikkili vedanache
mana yesuprabhuvu taane vedukonenu -
paapula vimochana korake ॥choodull
5. premato koodina vaakkulache - aavarinchedi prabhuvu
vedana samayamuna aadarinchuvaaru -
leka baadha nondenu ॥choodu॥
6. ninnu tana vale maarchedi - ee mahaa premanu
talachi talachi hrudayamu karugagaa -
ne sadaa keertinchedanu ॥choodu॥
Comments
Post a Comment