చింతలేదిక యేసు పుట్టెను
చింతలేదిక యేసు పుట్టెను - వింతగను బెత్లహేమందున -
చెంతజేరను రండి సర్వజనాంగమా - సంతస మొందుమా ||చింత||
1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త - నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి ||చింత||
2 చుక్క గనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొన
చక్కగా బెత్లము పురమున జొచ్చిరి-కానుక లిచ్చిరి ||చింత||
3. కన్య గర్భమునందు బుట్టెను - కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమె దీనులై - సర్వమాన్యులై ||చింత||
4. పాప మెల్లను పరిహరింపను - పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడుగడు భాగ్యము మోక్షభాగ్యము ||చింత||
Chintaledika yesu puttenu - vintaganu betlahemanduna -
Chentajeranu randi sarvajanaangamaa - santasa mondumaa ||chinta||
1. doota telpenu gollalaku shubhavaarta - naa divasambu vintagaa
khyaati meeraga vaaru yesunu gaanchiri stutulonarinchiri ||chinta||
2 chukka ganugoni jnyaanulento makkuvato naa prabhuni ganugona
chakkagaa betlamu puramuna jochchiri-kaanuka lichchiri ||chinta||
3. kanya garbhamunandu buttenu - karunagala rakshakudu kreestudu
dhanyulagutaku randi vegame deenulai - sarvamaanyulai ||chinta||
4. paapa mellanu pariharimpanu - parama rakshakudavatarinchenu
daapu jerina vaarikidugadu bhaagyamu mokshabhaagyamu ||chinta||
Comments
Post a Comment