చెట్లులేని మెట్టలందు
చెట్లులేని మెట్టలందు నదుల పారజేయు దేవా
1. అడవి బీడుల ఎడారులను - ఎండిపోయిన నేలను
ఏదేనుగా మార్చువాడ - నా హృదయము మార్చుము ॥చెట్లు||
2. ఎండియున్న లోయలందు - దండిగ జీవనదిన్
మెండుగ ప్రవహింపజేయుము - బండయైన క్రీస్తును ||చెట్లు||
3. నీటికాలువయోర నుండి - జీవ వృక్షపుటాకుగా
సాటి మానవకోటి మధ్యను - నిల్పుకొమ్ము-నీ శక్తితో ||చెట్లు||
4. శక్తిహీనుడ నే శాంతిలేక - అలసి సొలసియుంటిని
ముక్తిదాత పీషోను - గీహోను నదుల పారజేయుము ||చెట్లు||
5. సంకుచితమై సమృద్ధిలేక - సారహీనమైతినే
ఇంక హిద్దెకలు - ఫరాతునదుల పారజేయుము ||చెట్లు||
6. మరణమునకు పాత్రుడనై నిష్ఫలితముగా - నుంటిని
పరమ జీవ వృక్షఫలమును - ఫలింపజేయు నెలనెలన్ ||చెట్లు||
Chetluleni mettalandu nadula paarajeyu devaa
1. adavi beedula edaarulanu - endipoyina nelanu
edenugaa maarchuvaada - naa hrudayamu maarchumu ॥chetlu||
2. endiyunna loyalandu - dandiga jeevanadin
menduga pravahimpajeyumu - bandayaina kreestunu ||chetlu||
3. neetikaaluvayora nundi - jeeva vrukshaputaakugaa
saati maanavakoti madhyanu - nilpukommu-nee shaktito ||chetlu||
4. shaktiheenuda ne shaantileka - alasi solasiyuntini
muktidaata peeshonu - geehonu nadula paarajeyumu ||chetlu||
5. sankuchitamai samruddhileka - saaraheenamaitine
inka hiddekalu - pharaatunadula paarajeyumu ||chetlu||
6. maranamunaku paatrudanai nishphalitamugaa - nuntini
parama jeeva vrukshaphalamunu - phalimpajeyu nelanelan ||chetlu||
Comments
Post a Comment