చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా
ప్రేమామయుడివై ప్రేమించావు - కరుణామయుడివై కరుణించావు
తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించి ప్రేమ కరుణ నీ కృపచాలు (2)
1. జిగటగల ఊబిలో పడియుండగ- నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2)
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా - హిమము కంటెను తెల్లగ మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా-నా జీవితమంత అర్పింతు నీకయ్యా (2)
2. బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రలే నన్ను వెలివేసినా (2)
నన్ను నీవు విడువనెలేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా-నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్యా (2)
No comments:
Post a Comment