చూచుచున్నాము నీవైపు

చూచుచున్నాము నీవైపు - మా ప్రియ జనక చూచుచున్నాము
నీవైపు  =  చూచుచు నీ ప్రేమ - సొంపు సువార్తను
జాచుచు గరములు  - చక్కగా నీవైపు ll చూచు ll 


1. మే మరులమై యుంటిమి - మార్గము వీడి మేమందరము పోతిమి =
  ప్రేమచే నప్పుడు - ప్రియ తనయ నంపించి -  క్షేమమార్గము
  మాకు -  బ్రేమను  జూపితివి ll చూచు ll 


2. నిను నమ్ము పాపులకు - వారెవరైన - నీ శరణు జొచ్చువారలకు=
  ఇనుడవు కేడెంబు-నీ జగతిలో నగుచు గనుపరచుచుందువు
  ఘనమైన నీ కృప ll చూచు ll 


3. నీ భయము మాయెదలను - నిలుపుము నీదు - ప్రాభవ మొనరంగను =
    నీ భయముచే మేము - వైభవ మొందుచు - నే భయము లేకుండ -
    నీ భువిని గొన్నాళ్ళు ll చూచు ll 


4. దయజూచి మము నెప్పుడు - మంచివి యన్ని -  దయచేయు మెల్లప్పుడు  
  దయచేయరానివి దయచేయుమని కోర -
  దయజూపి మన్నించు - దయగల మా తండ్రి ll చూచు ll  Choochuchunnaamu neevaipu - maa priya janaka choochuchunnaamu Neevaipu = choochuchu nee prema - sompu suvaartanu Jaachuchu garamulu - chakkagaa neevaipu ll choochu ll 1. me marulamai yuntimi - maargamu veedi memandaramu potimi = premache nappudu - priya tanaya nampinchi - kshemamaargamu maaku - bremanu joopitivi ll choochu ll 2. ninu nammu paapulaku - vaarevaraina - nee sharanu jochchuvaaralaku= inudavu kedembu-nee jagatilo naguchu ganuparachuchunduvu ghanamaina nee krupa ll choochu ll 3. nee bhayamu maayedalanu - nilupumu needu - praabhava monaranganu = nee bhayamuche memu - vaibhava monduchu - ne bhayamu lekunda - nee bhuvini gonnaallu ll choochu ll 4. dayajoochi mamu neppudu - manchivi yanni - dayacheyu mellappudu dayacheyaraanivi dayacheyumani kora - dayajoopi manninchu - dayagala maa tandri ll choochu ll


Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు