ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా
ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు
నా యేసయ్యలాంటి మంచి స్నేహితుడు
ప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు ॥ఎవరైనా॥
1. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా
ప్రేమ చూపువారు లేరు లోకమందునా
నేను కోరుకోకుండా నా కోసము -
తనకు తాను చేసినాడు సిలువయాగము ॥ఎవరైనా॥
2. అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండా
జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా
నీచుడనని చూడకుండా నా కోసము
మహిమనంతా వీడినాడు ఏమి చిత్రము ॥ఎవరైనా॥
3. స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండా
మేలు చేయువారు ఎవరు విశ్వమందునా
ఏమి దాచుకోకుండా నా కోసము -
ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము ॥ఎవరైనా॥
Evarainaa unnaaraa echatainaa unnaaraa eelaati snehitudu naa yesayyalaanti manchi snehitudu preminchi praanambettina goppa snehitudu ॥evarainaa॥ 1. hetuvemi lekundaa laabhamemi pondakundaa prema choopuvaaru leru lokamandunaa nenu korukokundaa naa kosamu - tanaku taanu chesinaadu siluvayaagamu ॥evarainaa॥ 2. antasthulu lekundaa arhatalu choodakundaa jatanu koruvaaru dorakaru enta vedakinaa neechudanani choodakundaa naa kosamu mahimanantaa veedinaadu emi chitramu ॥evarainaa॥ 3. svaardhamemi lekundaa phalitam aashinchakundaa melu cheyuvaaru evaru vishvamandunaa emi daachukokundaa naa kosamu - unnadantaa ichchinaadu emi tyaagamu ॥evarainaa॥
Comments
Post a Comment