ఎంత జాలి యేసువా - ఇంతయని యూహించలేను

ఎంత జాలి యేసువా - ఇంతయని యూహించలేను ॥ఎంత॥


1. హానికరుడ హింసకుడను - దేవ దూషకుడను నేను
    అవిశ్వాసినైన నన్ను - ఆదరించినావుగా ॥ఎంత॥


2. రక్షకుండ నాకు బదులు - శిక్ష ననుభవించినావు
    సిలువ యందు సొమ్మసిల్లి చావొందితివి నాకై ॥ఎంత॥ 


3. ఏమి నీ కర్పించగలను ఏమి లేనివాడనయ్యా
  రక్షణపు పాత్ర నెత్తి - స్తోత్ర మంచు పాడెద ॥ఎంత॥


4. నీదు నామమునకు ఇలలో- భయపడెడి వారి కొరకై
    నాధుడా నీవిచ్చు మేలు - యెంత గొప్ప యేసువా ॥ఎంత॥

5. నేను బ్రతుకు దినములన్ని - క్షేమమెల్ల వేళలందు
    నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చువాడా ప్రభువా ॥ఎంత॥ Enta jaali yesuvaa - intayani yoohinchalenu ॥enta॥ 1. haanikaruda hinsakudanu - deva dooshakudanu nenu avishvaasinaina nannu - aadarinchinaavugaa ॥enta॥ 2. rakshakunda naaku badulu - shiksha nanubhavinchinaavu siluva yandu sommasilli chaavonditivi naakai ॥enta॥ 3. emi nee karpinchagalanu emi lenivaadanayyaa rakshanapu paatra netti - stotra manchu paadeda ॥enta॥ 4. needu naamamunaku ilalo- bhayapadedi vaari korakai naadhudaa neevichchu melu - yenta goppa yesuvaa ॥enta॥ 5. nenu bratuku dinamulanni - kshemamella velalandu nishchayamuga neevu naaku - ichchuvaadaa prabhuvaa ॥enta॥

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు