ఎందుకో ఈ ఘోర పాపిని
ఎందుకో ఈ ఘోర పాపిని - చేరదీసావు ప్రభువా ఏముంది నాలో
నీ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే
అయిననూ నన్ను కరుణించావు - ప్రేమించావు నన్ను విడిపించావు ॥ఎందుకో||
1. నా అతిక్రమములకై నా పాపములకై గాయాలు పొందినావే
నా దోషములకై కురూపిగా మారి నీ నోరు తెరువలేదే
నీ ప్రేమ మధురం - నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను - మురిపించింది (2) ॥ఎందుకో॥
2. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావా
ఆదరణ కరువై బాధింపబడియూ నీ నోరూ తెరువలేదే
నీ ప్రేమ మధురం - నీ ప్రేమ అమరం -
నీ త్యాగమే నన్ను - మురిపించింది (2) ॥ఎందుకో॥
3. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావా
గుచ్చిరి శిరమున్ ముండ్ల మకుటాన్ని నా కోసం భరియించావా
నీ ప్రేమ మధురం – నీ ప్రేమ అమరం -
నీ త్యాగమే నన్నుమురిపించింది ॥ఎందుకో॥
Enduko ee ghora paapini -
cheradeesaavu prabhuvaa emundi naalo
Nee parishuddhata lede ayinaa nanu preminchitive
Ayinanoo nannu karuninchaavu -
preminchaavu nannu vidipinchaavu ॥enduko||
1. naa atikramamulakai naa
paapamulakai gaayaalu pondinaave
naa doshamulakai kuroopigaa maari nee noru teruvalede
nee prema madhuram - nee prema amaram
nee tyaagame nannu - muripinchindi (2) ॥enduko॥
2. anyaayapu teerpu pondaavu
naakai apahaasyam bhariyinchaavaa
aadarana karuvai baadhimpabadiyoo nee noroo teruvalede
nee prema madhuram - nee prema amaram -
nee tyaagame nannu - muripinchindi (2) ॥enduko॥
3. ummiri needu momupaina naa kosam bhariyinchaavaa
guchchiri shiramun mundla makutaanni naa kosam bhariyinchaavaa
nee prema madhuram – nee prema amaram -
nee tyaagame nannumuripinchindi ॥enduko॥
Comments
Post a Comment