ఎండిన ఎడారి బ్రతుకులో
ఎండిన ఎడారి బ్రతుకులో - నిండైన ఆశ నీవేగా
యేసు.. నిండైన ఆశ నీవేగా - తడబడెడు నా పాదములకు
తోడు నీవే గదా - యేసు.. తోడు నీవే సదా ||ఎండిన||
1.ఎండమావులు చూచి నేను - అలసి వేసారితి (2)
జీవ జలముల ఊట నీవై - సేద దీర్చితివి
నా బలము నీవైతివే - యేసు.. బలము నీవైతివే ||ఎండిన||
2.నిత్య మహిమకు నిలయుడా నీ - దివ్య కాంతిలోన (2)
నీదు ఆత్మతో నన్ను నింపి - ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే - యేసు.. సారధి నీవైతివే ||ఎండిన||
3.అంధకార లోయలెన్నో - ఎదురు నిలచినను (2)
గాయపడిన నీ హస్తమే నన్ను - గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా - యేసు.. శరణు నీవే గదా ||ఎండిన||
Endina edaari bratukulo - nindaina aasha neevegaa
Yesu.. nindaina aasha neevegaa - tadabadedu naa paadamulaku
Todu neeve gadaa - yesu.. todu neeve sadaa ||endina||
1.endamaavulu choochi nenu - alasi vesaariti (2)
Jeeva jalamula oota neevai - seda deerchitivi
Naa balamu neevaitive - yesu.. balamu neevaitive ||endina||
2.nitya mahimaku nilayudaa nee - divya kaantilona (2)
Needu aatmato nannu nimpi - phalimpa jesitive
Naa saaradhi neevaitive - yesu.. saaradhi neevaitive ||endina||
3.andhakaara loyalenno - eduru nilachinanu (2)
Gaayapadina nee hastame nannu - gamyamu cherchunu
Naa sharanu neeve gadaa - yesu.. sharanu neeve gadaa ||endina||
Comments
Post a Comment