ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర - హల్లెలూయ యేసయ్యా (2)
1.నా పాపము బాప నరరూపివైనావు - నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే హల్లెలూయ యేసయ్యా (2) ||ఎందుకో||
2.నీ రూపము నాలో నిర్మించియున్నావు - నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి - నీ కొరకై నీ కృపలో హల్లెలూయ యేసయ్యా(2) ||ఎందుకో||
3.నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు - నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు - నను దాచియున్నావు హల్లెలూయ యేసయ్యా (2) ||ఎందుకో||
4.నీ సన్నిధి నాలో నా సర్వము నీలో - నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు - నన్ను విడువనంటివే హల్లెలూయ యేసయ్యా (2) ||ఎందుకో||
5.నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే - నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతున్ హల్లెలూయ యేసయ్యా (2) ||ఎందుకో||
Enduko nannintagaa neevu - preminchitivo devaa
Anduko naa deena stutipaatra - hallelooya yesayyaa (2)
1.naa paapamu baapa nararoopivainaavu -
naa shaapamu maapa naligi vrelaaditivi
Naaku chaalina devudavu neeve -
naa sthaanamulo neeve hallelooya yesayyaa (2) ||enduko||
2.nee roopamu naalo nirminchiyunnaavu -
nee polikalone nivasinchumannaavu
Neevu nannu ennukontivi -
nee korakai nee krupalo hallelooya yesayyaa(2) ||enduko||
3.naa shramalu sahinchi naa aashrayamainaavu -
naa vyadhalu bharinchi nannaadukonnaavu
Nannu neelo choochukunnaavu -
nanu daachiyunnaavu hallelooya yesayyaa (2) ||enduko||
4.nee sannidhi naalo naa sarvamu neelo -
nee sampada naalo naa sarvasvamu neelo
Neevu nenu ekamaguvaraku -
nannu viduvanantive hallelooya yesayyaa (2) ||enduko||
5.naa manavulu munde - nee manasulo neravere -
naa manugada munde nee granthamulonunde
Emi adbhuta prema sankalpam -
nenemi chellintun hallelooya yesayyaa (2) ||enduko||
Comments
Post a Comment