ఎన్ని రోజులగునో
ఎన్ని రోజులగునో - యేసుని సువార్త
అన్ని దేశములకు అందించ ఎన్ని రోజులగునో (2)
1. గొజ్జెలు ఎన్నెన్నో - దారి తప్పుచుండ
వెదకెడివారలకు నా బలం ధారాళం II ఎన్నిII
2. సాతాను తంత్రములు పెరిగెడి రోజులలో
దేవుని పిల్లలందు - ఐక్యత కనిపించునా II ఎన్నిII
3. అక్కర పెరుగుచుండ అవకాశము చేజార
దీనులై సేవకులు - కలిసెడు రోజెపుడో II ఎన్నిII
4. కోపము క్రోధములు విసుకు విభజనలు
దేవుని సంఘమును - ఎన్నడు విడనాడున్ II ఎన్నిII
5. గోధుమ గింజవలె - మంటిలో మరుగపడి
సజీవ క్రైస్తవులు - లేచెడి రోజేపుడో II ఎన్నిII Enni rojulaguno - yesuni suvaarta Anni deshamulaku andincha enni rojulaguno (2) 1. gojjelu ennenno - daari tappuchunda vedakedivaaralaku naa balam dhaaraalan II enniII 2. saataanu tantramulu perigedi rojulalo devuni pillalandu - aikyata kanipinchunaa II enniII 3. akkara peruguchunda avakaashamu chejaara deenulai sevakulu - kalisedu rojepudo II enniII 4. kopamu krodhamulu visuku vibhajanalu devuni sanghamunu - ennadu vidanaadun II enniII 5. godhuma ginjavale - mantilo marugapadi sajeeva kraistavulu - lechedi rojepudo II enniII
Comments
Post a Comment