ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)    ||ఇంత కాలం||

1.ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)         ||ఇంత కాలం||

2.నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)           ||ఇంత కాలం||

3.దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)           ||ఇంత కాలం|| Inta kaalam needu krupalo kaachina devaa (2) Ikanu koodaa maaku todu needa neeve kadaa (2)llinta kaalanll 1.enni ellu gadachinaa – enni taraalu maarinaa (2) Maarani veedani preme needayyaa Maarchina naa jeevitam neeke yesayyaa (2) ||inta kaalan|| 2.neevu chesina melulu – talachukundunu anudinam (2) Naa stuti stotramu neeke yesayyaa Verugaa emiyu chellinchalenayyaa (2) ||inta kaalan|| 3.dooramaitiri aaptulu – vidachipotiri naa hitulu (2) Shodhana vedana teerchina yesayyaa Tallilaa tandrilaa kaachina yesayyaa (2) ||inta kaalan||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు